Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

Stock Market Updates: ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి స్టాక్ మార్కెట్లు

ABN , Publish Date - Mar 04 , 2024 | 09:49 AM

దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల జోరుతో కొనసాగుతున్నాయి. వారాంతం మొదటి రోజైన నేడు లాభాల దిశగా కొనసాగుతూ ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

Stock Market Updates: ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు(stock markets) లాభాల జోరుతో కొనసాగుతున్నాయి. గత రెండు సెషన్లు లాభాలతో ముగియగా.. వారాంతం మొదటి రోజైన నేడు కూడా లాభాల్లోనే దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా నిఫ్టీ 22,200 జోన్‌ను అధిగమించి మరోసారి ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. ఆ క్రమంలో 22,419 పాయింట్ల స్థాయిని తాకి ట్రేడవుతుంది. మరోవైపు సెన్సెక్స్ కూడా ఒక దశలో 160 పాయింట్లు పెరిగి కొత్త గరిష్టం 73,950 పాయింట్ల ఎగువన ట్రేడైంది.

అయితే గ్లోబల్ మార్కెట్ల(global markets) నుంచి వస్తున్న సానుకూల సంకేతాలు, గత వారం భారతదేశం మూడో త్రైమాసిక GDP వృద్ధి అంచనాల కంటే మెరుగ్గా ఉండటం సహా పలు అంశాలు స్టాక్ మార్కెట్ల లాభాలకు కారణమని తెలుస్తోంది. అంతేకాదు రాబోయే రోజుల్లో 22,500, 22,800 స్థాయిల తదుపరి లక్ష్యాలను కూడా నిఫ్టీ చేరుకుంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.


ఈ క్రమంలో ప్రస్తుతం NTPC, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, పవర్ గ్రిడ్ కార్ప్, ONGC, బజాజ్ ఆటో వంటి సంస్థల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉండగా.. JSW స్టీల్, టాటా స్టీల్, ఐషర్ మోటార్స్, అపోలో హాస్పిటల్, టైటాన్ వంటి కంపెనీల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉన్నాయి. గత వారం శనివారం ప్రత్యేక ట్రేడింగ్ సెషన్‌లో భారతీయ స్టాక్ మార్కెట్ తన ర్యాలీని పొడిగించింది. నిఫ్టీ 50 ఇండెక్స్ 39 పాయింట్లు పెరిగి 22,378 వద్ద ముగిసింది. BSE సెన్సెక్స్ 60 పాయింట్లు పెరిగి 73,806 మార్క్ వద్ద స్థిరంగా ఉంది.

మరిన్ని తాజా వార్తల కోసం క్లిక్ చేయండి: AP news: నటి సౌమ్యశెట్టి దొంగావతారం!.. ఫ్రెండ్ ఇంట్లో వాష్‌రూమ్‌కి వెళతానంటూ..

Updated Date - Mar 04 , 2024 | 09:52 AM