Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

AP news: నటి సౌమ్యశెట్టి దొంగావతారం!.. ఫ్రెండ్ ఇంట్లో వాష్‌రూమ్‌కి వెళతానంటూ..

ABN , Publish Date - Mar 04 , 2024 | 03:41 AM

స్నేహం పేరిట దగ్గ రైంది. తరచూ ఇంటికి కూడా వచ్చి వెళ్లేది. ఈ క్రమంలోనే స్నేహితురాలి ఇంట్లో బంగారంపై కన్నేసిన ఆ సినీనటి..

AP news: నటి సౌమ్యశెట్టి దొంగావతారం!.. ఫ్రెండ్ ఇంట్లో వాష్‌రూమ్‌కి వెళతానంటూ..

స్నేహితురాలి ఇంట్లో విడతలవారీగా బంగారం చోరీ

ఆ నగలు విక్రయించి గోవాలో ఎంజాయ్‌

కొత్త నగలు కొనుగోలు.. క్రెడిట్‌ కార్డు అప్పులు చెల్లింపు

బ్యాంకు ఖాతా లావాదేవీల్లో గుర్తించిన పోలీసులు

దొంగతనం కేసులో అరెస్టు.. 57 తులాలు రికవరీ

విశాఖపట్నం, మార్చి 3(ఆంధ్రజోతి): స్నేహం పేరిట దగ్గ రైంది. తరచూ ఇంటికి కూడా వచ్చి వెళ్లేది. ఈ క్రమంలోనే స్నేహితురాలి ఇంట్లో బంగారంపై కన్నేసిన ఆ సినీనటి.. బెడ్‌ రూమ్‌లోని కప్‌బోర్డులో భద్రపరిచిన బంగారాన్ని విదడత వారీగా మాయం చేసింది. కొద్దిరోజుల తర్వాత చోరీ విషయం గుర్తించిన స్నేహితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సినీనటి సౌమ్యశెట్టి బండారం బయటపడింది. ఈ కేసులో 57 తులాల బంగారాన్ని రికవరీ చేసిన పోలీసులు ఆ మెను అరెస్టు చేసి ఈ నెల 1న రిమాండ్‌కు తరలించారు. విశాఖపట్నంలోని దొండపర్తి ప్రాంతంలోని బాలాజీ రెసిడెన్సీ లో ఉంటున్న జనపాల ప్రసాద్‌ ఉద్యోగ విరమణ చేశారు. ఆయన కుమార్తె మౌనిక 2016లో బీటెక్‌ చదువుతుండగా యూట్యూబ్‌ రీల్స్‌, షార్ట్‌ఫిల్స్మ్‌లో నటించే గోపాలపట్నం సమీపంలోని వెంకటాపురానికి చెందిన సౌమ్యతో పరిచయమైంది. మౌనికకు మోడలింగ్‌పై ఆసక్తి ఉండడంతో ఇద్దరూ కలిసి షార్ట్‌ఫిల్మ్స్‌లో కూడా నటించారు. తర్వాత మౌనికకు వివాహం చేయడంతో ఇద్దరి మధ్య స్నేహం తెగిపోయింది. సౌమ్య కూ డా సుజాతానగర్‌లో ఉంటున్న ఒడిశాకు చెందిన బలరాం శెట్టిని ప్రేమ వివాహం చేసుకుంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో మళ్లీ స్నేహం: ఇటీవల మౌనికకు పాప పుట్టడంతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ ఏడాది జనవరిలో సౌమ్యశెట్టి ఆ పోస్ట్‌ని చూసి కామెంట్‌ పెట్టింది. దీంతో ఇద్దరి మధ్య మళ్లీ స్నేహం చిగురించింది. దొండపర్తిలోని పుట్టింట్లో ఉంటున్నానని మౌనిక చెప్పింది. సౌమ్యశెట్టి కూడా తాను ఇటీవలే ‘ద ట్రిప్‌’ ‘యు వర్స్‌ లవింగ్లీ’ సినిమాల్లో నటించానని, మరికొన్ని షార్ట్‌ఫిల్మ్స్‌లో నటిస్తున్నానని చెప్పింది. ఈ క్రమంలో సౌమ్య పలుమార్లు మౌనిక పుట్టింటికి వెళ్లి వచ్చారు. ఈనెల 23న ఎలమంచిలిలోని బంధువుల ఇంట శుభకార్యక్రమం ఉండడంతో మౌనికతోపాటు ఆమె తల్లిదండ్రులు బంగారు ఆభరణాల కోసం బెడ్‌రూమ్‌లోని కప్‌బోర్డు తెరిచారు. ఆభరణాలు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదుచేశారు. పోలీసులు కేసు నమోదుచేసి వివరాలు సేకరించారు. తరచూ ఇంటికి వచ్చి వెళ్లినవారి లో సౌమ్యశెట్టి ఉన్నట్టు చెప్పడంతోపాటు ఆమె పలుమార్లు వాష్‌రూమ్‌కి వెళతానంటూ మాస్టర్‌ బెడ్‌రూమ్‌లోకి వెళ్లి డోర్‌ వేసుకునేదని చెప్పారు.

దీంతో పోలీసులకు ఆమెపై అనుమా నం ఏర్పడింది. ముందుగా ఆమె బ్యాంకు ఖాతాల వివరాలను సేకరించి, లావాదేవీలను పరిశీలించారు. ఫిబ్రవరి 6న విశాఖలోని లలితా జ్యువెలరీలో రూ.పది లక్షల విలువైన పాతబంగారం విక్రయించి, కొత్త నగలు తీసుకున్నట్టు గుర్తించారు. అలాగే కురుపాం మార్కెట్‌లోని 2 బంగారం దుకాణాల వద్ద పాత బంగారం విక్రయించి, ఆ డబ్బుని ఏటీఎం ద్వారా తన ఖాతాలోకి డిపాజిట్‌ చేసుకున్నట్టు గుర్తించారు. దీంతో సౌమ్యశెట్టిని అదుపులోకి తీసుకుని విచారించగా మొదట తనకేమీ తెలియదని చెప్పింది. పోలీసులు ఆమె లావాదేవీలను బయటపెట్టడంతో నేరాన్ని అంగీకరించింది. బంగారం విక్రయించిన డబ్బులో రూ.4 లక్షలు ఖర్చుపెట్టి గోవాలో ఎంజాయ్‌ చేశానని, మరో రూ.2 లక్షలు క్రెడిట్‌కార్డు అప్పులు కట్టానని, రూ. 1.5 లక్షలుతో కార్‌కు మరమ్మతులు చేయించానని తెలిపింది.

Updated Date - Mar 04 , 2024 | 06:55 AM