Share News

Stock Markets: స్టాక్ మార్కెట్ల జూమ్..సెన్సెక్స్ 765 పాయింట్లు జంప్

ABN , Publish Date - Mar 21 , 2024 | 10:25 AM

దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) గురువారం భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో స్టాక్ మార్కెట్ తిరిగి తన వైభవాన్ని సంతరించుకుంది. బుల్లిష్ ట్రాక్‌లో దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్‌లో నిఫ్టీ 22000 దాటింది.

Stock Markets: స్టాక్ మార్కెట్ల జూమ్..సెన్సెక్స్ 765 పాయింట్లు జంప్

దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) గురువారం భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో స్టాక్ మార్కెట్ తిరిగి తన వైభవాన్ని సంతరించుకుంది. బుల్లిష్ ట్రాక్‌లో దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్‌లో నిఫ్టీ 22000 దాటింది. సెన్సెక్స్(sensex) కూడా 72851 స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో 10.15 గంటల నిమిషాలకు సెన్సెక్స్ 765 పాయింట్ల భారీ లాభంతో 72850 స్థాయి వద్ద ఉండగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ(nifty) 230 పాయింట్ల లాభంతో 220725 పరిధిలో ఉంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు 656, 852 పాయింట్లు వృద్ధి చెందాయి.

ఈ క్రమంలో ప్రస్తుతం BPCL, టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, హిందాల్కో, NTPC కంపెనీల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉండగా, హీరో మోటోకార్ప్, నెస్లే, సన్ ఫార్మా, బ్రిటానియా, మారుతీ సుజుకి సంస్థల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉన్నాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో నిఫ్టీ ఆయిల్, గ్యాస్ షేర్లు 1.29 శాతం పెరగగా, నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ ప్రారంభ ట్రేడ్‌లో వరుసగా 0.62 శాతం, 0.48 శాతం లాభపడ్డాయి.


అమెరికా స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ఆల్ టైమ్ హై(all time high) వద్ద ముగిశాయి. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 401.37 పాయింట్లు లేదా 1.03% పెరిగి 39,512.13 వద్దకు చేరుకోగా, S&P 500 46.11 పాయింట్లు లేదా 0.89% పెరిగి 5,224.62 వద్దకు చేరుకుంది. అమెరికా ఫెడ్ ద్రవ్య పరపతి విధాన ఫలితాల తర్వాత వాల్ స్ట్రీట్‌లో ఆసియా మార్కెట్లు లాభపడ్డాయి. దీంతో నిక్కీ 1.57% జంప్ చేసి కొత్త ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. మరోవైపు దక్షిణ కొరియా కోస్పి కూడా అత్యధిక స్థాయికి 1.52% పెరిగింది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Banks: మార్చి 31న ఆదివారం కూడా దేశవ్యాప్తంగా బ్యాంకులు ఓపెన్.. కారణమిదే

Updated Date - Mar 21 , 2024 | 10:27 AM