Share News

Banks: మార్చి 31న ఆదివారం కూడా దేశవ్యాప్తంగా బ్యాంకులు ఓపెన్.. కారణమిదే

ABN , Publish Date - Mar 21 , 2024 | 09:58 AM

సామాన్యులకు బ్యాంకుకు(bank) సంబంధించి గుడ్ న్యూస్ వచ్చింది. మార్చి 31, 2024 ఆదివారం అయినప్పటికీ, దేశంలోని అన్ని బ్యాంకులు తెరిచి ఉంటాయి. దీనికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నోటిఫికేషన్ విడుదల చేసింది.

Banks: మార్చి 31న ఆదివారం కూడా దేశవ్యాప్తంగా బ్యాంకులు ఓపెన్.. కారణమిదే

మార్చి 31న ఆదివారం కూడా బ్యాంకులు(banks) బంద్ ఉంటాయని మీరు అనుకుంటున్నారా. కానీ ఈసారి మాత్రం అలా జరగడం లేదు. ఎందుకంటే మార్చి 31న ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో చివరి రోజు. దీంతో అన్ని బ్యాంకు శాఖలను మార్చి 31, 2024 ఆదివారం తెరిచి ఉంచాలని బ్యాంకులకు RBI సూచనలు జారీ చేసింది. ఈ క్రమంలో ఆదివారం సెలవు రోజున కూడా బ్యాంకులు ప్రజల కోసం తెరిచి ఉంటాయని వెల్లడించింది.

ఇది కాకుండా అన్ని ఏజెన్సీ బ్యాంకులు కూడా ప్రజలకు(people) అందుబాటులో ఉంటాయి. తద్వారా రసీదులు, చెల్లింపులకు సంబంధించిన అన్ని ప్రభుత్వ లావాదేవీలు FY24లో నిర్వహించబడతాయి. ఈ నోటిఫికేషన్‌ను ఆర్‌బీఐ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ సునీల్‌ టీఎస్‌ నాయర్‌ విడుదల చేశారు. మరోవైపు ఆర్థిక సంవత్సరం ముగింపు కారణంగా, ఆదాయపు పన్ను శాఖ తన అన్ని కార్యాలయాలకు సుదీర్ఘ వారాంతపు సెలవులను కూడా రద్దు చేసింది.


దీంతోపాటు ఆదాయపు పన్ను (income tax)శాఖలోని అన్ని కార్యాలయాలు మార్చి 29 (శుక్రవారం), మార్చి 30 (శనివారం), మార్చి 31 (ఆదివారం) తెరిచి ఉంటాయి. ఆర్థిక సంవత్సరం చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున జరిగే లావాదేవీలను పూర్తి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇది కాకుండా NEFT, RTGS లావాదేవీలు కూడా అర్ధరాత్రి 12 గంటల వరకు కొనసాగుతాయి.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Viral Video: కొంపముంచిన ప్రీ వెడ్డింగ్ షూట్.. ఏమైందో తెలుసా?

Updated Date - Mar 21 , 2024 | 09:59 AM