Share News

Stock Market: నేడు స్టాక్ మార్కెట్ స్పెషల్ ట్రేడింగ్.. ఇవే ట్రెండింగ్ స్టాక్స్

ABN , Publish Date - Mar 02 , 2024 | 10:01 AM

దేశీయ స్టాక్ మార్కెట్ స్పెషల్ ట్రేడింగ్ సెషన్‌లో షేర్ మార్కెట్ సరికొత్త రికార్డును నమోదు చేసింది. సెన్సెక్స్ 73,881 పాయింట్ల వద్ద, నిఫ్టీ 22407 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యాయి.

Stock Market: నేడు స్టాక్ మార్కెట్ స్పెషల్ ట్రేడింగ్.. ఇవే ట్రెండింగ్ స్టాక్స్

దేశీయ స్టాక్ మార్కెట్(stock market) స్పెషల్ ట్రేడింగ్ సెషన్‌లో షేర్ మార్కెట్ సరికొత్త రికార్డును నమోదు చేసింది. సెన్సెక్స్(sensex) 73,881 పాయింట్ల వద్ద, నిఫ్టీ(nifty) 22407 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యాయి. ఈరోజు శనివారం స్టాక్ మార్కెట్ ప్రత్యేక కారణంతో తెరిచి ఉంది. వాస్తవానికి విపత్తు పునరుద్ధరణ సైట్ పరీక్షను NSE, BSE చేయవలసి ఉంది. దీని కారణంగా మార్కెట్ తెరిచి ఉంచారు.

ట్రేడింగ్ 2 సెషన్లలో జరుగుతుంది. ప్రాథమిక సైట్‌లో మొదటి ట్రేడింగ్ సెషన్ ఉదయం 9.15 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు కొనసాగుతుంది. దీని తర్వాత NSE BSE ప్రైమరీ సైట్ నుంచి డిజాస్టర్ రికవరీ సైట్‌కి మారుతుంది. డిజాస్టర్ రికవరీ సైట్‌లో లైవ్ ట్రేడింగ్ మళ్లీ ఉదయం 11.30 గంటలకు ప్రారంభమై ఇది మధ్యాహ్నం 12.30 గంటలకు ముగుస్తుంది.


ఈ నేపథ్యంలో మొదటి ప్రత్యేక సెషన్‌ శనివారం నాడు స్థిరంగా ప్రారంభించాయి. సెన్సెక్స్(sensex), నిఫ్టీ(nifty) రెండూ ఈరోజు సరికొత్త రికార్డులను తాకాయి. ఈ క్రమంలో నిఫ్టీ తొలిసారిగా 22,400 దాటగా, సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా పెరిగి రికార్డు స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో ప్రస్తుతం టాటా స్టీల్, హీరో మోటోకార్ప్, టాటా మోటార్స్, అపోలో హాస్పిటల్, లార్సెన్ సంస్థల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉండగా.. NTPC, M&M, సన్ ఫార్మా, కోటక్ మహీంద్రా, ICICI బ్యాంక్ కంపెనీల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉన్నాయి.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Anant Radhika Wedding: ముఖేష్- నీతా అంబానీ డ్యాన్స్ వీడియో

Updated Date - Mar 02 , 2024 | 10:01 AM