Share News

Anant Radhika Wedding: ముఖేష్- నీతా అంబానీ డ్యాన్స్ వీడియో

ABN , Publish Date - Mar 02 , 2024 | 07:21 AM

ముకేశ్ అంబానీ- నీతా అంబానీలు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుక కోసం చాలా సన్నాహాలు చేశారు. ఇంతలో వీరు ఒక పాటకు డ్యాన్స్ రిహార్సల్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.

Anant Radhika Wedding: ముఖేష్- నీతా అంబానీ డ్యాన్స్ వీడియో

Anant Ambani-Radhika Merchant Pre Wedding: ముఖేష్ అంబానీ(mukesh ambani) చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుక మార్చి 1 నుంచి గుజరాత్‌లోని జామ్‌నగర్‌(gujarat jamnagar)లో జరుగుతోంది. మూడు రోజుల వేడుకలు శుక్రవారం కాక్‌టెయిల్, డ్రోన్ షో, అంతర్జాతీయ పాప్ ఐకాన్ రిహన్న గొప్ప ప్రదర్శనతో ప్రారంభమయ్యాయి. అయితే అవన్నీ జరగకముందే నీతా, ముఖేష్ అంబానీ తమ అతిథులను సూపర్ రొమాంటిక్ ప్రదర్శనతో ఆశ్చర్యపరిచారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ముఖేష్ అంబానీ- నీతా అంబానీ(nita ambani) 'ప్యార్ హువా ఇక్రార్ హువా' సినిమా పాటకు డ్యాన్స్ రిహార్సల్ చేస్తూ కనిపించారు. ఈ వీడియో ఎలా ఉందో మీరు కూడా ఓసారి చూసేయండి మరి.


ఇక అనంత్, రాధికల వివాహం 2024 జూలైలో జరగనున్న సంగతి తెలిసిందే. దీనికి ముందు వీరిద్దరి ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు గుజరాత్‌లోని జామ్‌నగర్‌(gujarat jamnagar)లో జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో అతని పెళ్లి ఆహ్వాన పత్రిక కూడా వచ్చింది. కార్డ్ మార్చి 1, 2024 అని పేర్కొంది. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌ కోసం సినీ ప్రపంచంలోని చాలా మంది పెద్ద తారలు పాల్గొన్నారు. అనన్య పాండే, అనిల్ కపూర్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, మాధురీ దీక్షిత్, రణవీర్ సింగ్-దీపికా పదుకొనే, కరీనా కపూర్ ఖాన్-సైఫ్ అలీ ఖాన్, హాలీవుడ్ సెలబ్రిటీ రిహన్న వంటి అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: జీఎస్‌టీ వసూళ్లు రూ.1.68 లక్షల కోట్లు ఫిబ్రవరిలో 12.5 శాతం వృద్ధి

Updated Date - Mar 02 , 2024 | 07:31 AM