Share News

Startup Mahakumbh: స్టార్టప్ మహాకుంభ్ దేశవ్యాప్తంగా పోటీ.. రూ.5 లక్షలు గెల్చుకునే ఛాన్స్

ABN , Publish Date - Mar 11 , 2024 | 04:56 PM

భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడూ స్టార్టప్‌ల ప్రోత్సాహంపై దృష్టి పెడుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్టార్టప్ మహాకుంభ్ నిర్వహించనుంది. ఈ స్టార్టప్ మహాకుంభ్ పోటీలో పాల్గొనేందుకు పలు స్టార్టప్‌ వ్యవస్థాపకులను ఆహ్వానిస్తున్నారు. దీంతోపాటు బహుమతులు కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

Startup Mahakumbh: స్టార్టప్ మహాకుంభ్ దేశవ్యాప్తంగా పోటీ.. రూ.5 లక్షలు గెల్చుకునే ఛాన్స్

భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడూ స్టార్టప్‌ల ప్రోత్సాహంపై దృష్టి పెడుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్టార్టప్ మహాకుంభ్(Startup Mahakumbh) నిర్వహించనుంది. ఈ కార్యక్రమాన్ని ఢిల్లీ(delhi)లోని ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో ఈ నెల 18 నుంచి 20 వరకు నిర్వహించనున్నారు. ఇందులో 1000కు పైగా స్టార్టప్‌లు పాల్గొనున్నాయి. అంతేకాదు ఈ కార్యక్రమానికి 1000 కంటే ఎక్కువ పెట్టుబడిదారులు, 500 కంటే ఎక్కువ ఇంక్యుబేటర్-యాక్సిలరేటర్లు రానున్నాయి. అయితే ఈ స్టార్టప్ మహాకుంభ్ పోటీ(competition)లో పాల్గొనేందుకు పలు స్టార్టప్‌ వ్యవస్థాపకులకు ఇది మంచి అవకాశం. దీని ద్వారా వారి ఉత్పత్తులను ప్రదర్శించవచ్చు. దీంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని ప్రభావితం చేసే ఆవిష్కరణలను గుర్తించి, బహుమతులు ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించారు. అయితే దీనిలో ఎలా పాల్గొనాలో ఇక్కడ చుద్దాం.

స్టార్టప్ మహాకుంభ్ కోసం నమోదు చేసుకోవడానికి మీరు దాని అధికారిక వెబ్‌సైట్ startupmahakumbh.orgకి వెళ్లి మీ వివరాలు నమోదు చేయాలి. ముందుగా మీ స్టార్టప్ ఏ రంగానికి చెందినదో చెప్పాలి. దీని తర్వాత స్టాల్ ఏర్పాటుకు రూ.30 వేలు చెల్లించాల్సి ఉంటుంది. దీని ధర రూ.50 వేలు. అయితే మార్చి 11 వరకు ప్రత్యేక ఆఫర్ కింద తగ్గింపు ఇస్తున్నారు. ఫారమ్‌లో మీ పేరు, చిరునామా, మొబైల్ నంబర్, GST నంబర్, పాన్ నంబర్, ఇమెయిల్, వెబ్‌సైట్, మీ స్టార్టప్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌ను అందించాలి. ఈ మొత్తం సమాచారాన్ని అందించిన తర్వాత మీరు చెల్లింపు పేజీకి వెళతారు. ఇందులో పాల్గొనాలనుకునే వ్యక్తులు రెండు విభాగాలలో నమోదు చేసుకోవచ్చు. మొదటిది ప్రతినిధులు, రెండవది ఎగ్జిబిటర్లు.


అయితే ఈ పోటీకి సమర్పించబడిన ప్రాజెక్ట్‌లు తప్పకుండా AI సాంకేతికతలపై ఆధారపడి ఉండాలని పేర్కొన్నారు. అవార్డు కేటగిరీలలో పేర్కొన్న ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పబ్లిక్ సమస్యలను పరిష్కరించగలిగే విధంగా ఉండాలి. చివరగా టాప్ ఆరు ప్రాజెక్టులను ఎంపిక చేసి ప్రతి ఒక్కరికీ 500,000 రూపాయల నగదు బహుమతిని అందించనున్నారు. ఈ పోటీ కోసం దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ మార్చి 15, 2024. షార్ట్‌లిస్ట్ చేయబడిన ప్రాజెక్ట్‌లు మార్చి 18న స్టార్టప్ మహాకుంభ్ పెవిలియన్‌లో ప్రదర్శించబడతాయి. ఈ కార్యక్రమానికి 10 కంటే ఎక్కువ దేశాల నుంచి ప్రతినిధులు, 40,000 కంటే ఎక్కువ వ్యాపార సందర్శకులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని భావిస్తున్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Vande Bharat: తెలుగు రాష్ట్రాల్లో మూడో వందే భారత్ ట్రైన్.. ప్రధాని మోదీచే రేపే ప్రారంభం

Updated Date - Mar 11 , 2024 | 04:56 PM