Share News

IRCTC: షిర్డీ, శని శింగణాపూర్, త్రయంబకేశ్వర్ టూర్ ప్లాన్.. 3 రోజులకు ఎంతంటే

ABN , Publish Date - Apr 08 , 2024 | 10:37 AM

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఎప్పటికప్పుడు పర్యాటకుల కోసం కొత్త కొత్త టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. ఈ క్రమంలోనే ప్రముఖ ఆలయాలైన షిర్డీ సాయి బాబాతో పాటు శని శింగనాపూర్, త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగాలను సందర్శించడానికి IRCTC ఇప్పటికే టూర్ ప్యాకేజీని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో అసలు ఈ ప్యాకేజీకి ఎంత ఖర్చు అవుతుందనేది ఇప్పుడు చుద్దాం.

IRCTC: షిర్డీ, శని శింగణాపూర్, త్రయంబకేశ్వర్ టూర్ ప్లాన్.. 3 రోజులకు ఎంతంటే

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఎప్పటికప్పుడు పర్యాటకుల కోసం కొత్త కొత్త టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. ఈ క్రమంలోనే ప్రముఖ ఆలయాలైన షిర్డీ సాయి బాబాతో పాటు శని శింగనాపూర్, త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగాలను సందర్శించడానికి IRCTC ఇప్పటికే టూర్ ప్యాకేజీని ప్రారంభించింది. ఈ ప్యాకేజీ ద్వారా మీరు మూడు రోజులు, రెండు రాత్రుల్లో షిర్డీ సాయి టెంపుల్, శని శింగనాపూర్, త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగాలను సందర్శించుకోవచ్చు.


ఈ టూర్ కోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్(Secunderabad Railway Station) నుంచి ప్రతి బుధవారంతోపాటు మరికొన్ని రోజుల్లో ట్రైన్స్ (trains) అందుబాటులో ఉంటాయి. మరుసటి రోజు నాగర్‌సోల్ చేరుకున్న తర్వాత, హోటల్‌లో పికప్, డ్రాప్ ఉంటుంది. చెక్ ఇన్ తర్వాత షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించుకోవచ్చు. తరువాత మధ్యాహ్నం హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి శని శింగనాపూర్‌కు వెళ్లి శని ఆలయానికి వెళ్తారు. సాయంత్రం తిరిగి నాగర్‌సోల్ స్టేషన్‌కి బయలుదేరుతారు. రాత్రిపూట ప్రయాణం చేసి మరుసటి రోజు సికింద్రాబాద్ స్టేషన్ చేరుకుంటారు.


థర్డ్ ఏసీలో ఒంటరిగా ప్రయాణిస్తే ఒక్కొక్కరికి రూ.13,100, ఇద్దరు వ్యక్తులకు ఒక్కరికి రూ.8,020, ట్రిపుల్ షేరింగ్ అయితే ఒక్కరికి రూ.6,390. ఇక స్లీపర్ క్లాస్‌లో ఒంటరిగా ప్రయాణించడానికి రూ.11,410, ఇద్దరు వ్యక్తులకు ఒక్కరికి రూ.6330, ట్రిపుల్ షేరింగ్ అయితే ఒక్కరికి రూ.4700 చెల్లించాల్సి ఉంటుంది. మీరు పిల్లలకు ప్రత్యేక ఫీజు చెల్లించాలి. ఈ ప్యాకేజీ గురించి మరింత సమాచారం కోసం మీరు IRCTC వెబ్‌సైట్ https://www.irctctourism.com/pacakage_description?packageCode=SCBR01ని సందర్శించవచ్చు. ఈ టూర్ ప్యాకేజీ కోసం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ఇది కాకుండా IRCTC టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్, జోనల్ కార్యాలయాలు, ప్రాంతీయ కార్యాలయాల ద్వారా కూడా బుకింగ్ సౌలభ్యం ఉంది.


ఇది కూడా చదవండి:

పునరుత్పాదక ఇంధనంపై రూ.2.30 లక్షల కోట్లు

ఎగుమతులపై మారుతి ఫోకస్‌


మరిన్ని బిజినెస్ వార్తల కోసం

Updated Date - Apr 08 , 2024 | 10:41 AM