Share News

Sensex: ప్రధాని మోదీ మూడోసారి ప్రమాణం తర్వాత..సెన్సెక్స్, నిఫ్టీ ఆల్‌టైమ్ రికార్డు

ABN , Publish Date - Jun 10 , 2024 | 10:28 AM

ప్రధాని నరేంద్ర మోదీ(narendra modi) వరుసగా మూడోసారి ప్రధాని అయ్యి చరిత్ర సృష్టించిన తర్వాత సోమవారం స్టాక్ మార్కెట్(stock market) కూడా మోదీ 3.0కి సెల్యూట్ చేసింది. దీంతో వారంలో మొదటి రోజైన సోమవారం (జూన్ 10న) BSE 30 షేర్ల సెన్సెక్స్(sensex) 323.64 పాయింట్ల బలమైన పెరుగుదలను నమోదు చేశాయి.

Sensex: ప్రధాని మోదీ మూడోసారి ప్రమాణం తర్వాత..సెన్సెక్స్, నిఫ్టీ ఆల్‌టైమ్ రికార్డు
Sensex 77000 mark all time record

ప్రధాని నరేంద్ర మోదీ(narendra modi) వరుసగా మూడోసారి ప్రధాని అయ్యి చరిత్ర సృష్టించిన తర్వాత సోమవారం స్టాక్ మార్కెట్(stock market) కూడా మోదీ 3.0కి సెల్యూట్ చేసింది. దీంతో వారంలో మొదటి రోజైన సోమవారం (జూన్ 10న) BSE 30 షేర్ల సెన్సెక్స్(sensex) 323.64 పాయింట్ల బలమైన పెరుగుదలతో మొదటిసారిగా 77,000 స్థాయిని దాటి 77,017 స్థాయిలో ప్రారంభమైంది. అదే సమయంలో NSE నిఫ్టీ(Nifty) కూడా మార్కెట్ ప్రారంభంతో 105 పాయింట్ల జంప్‌తో 23,400 వద్ద మొదలైంది. గత వారం చివరి ట్రేడింగ్ రోజైన శుక్రవారం సెన్సెక్స్, నిఫ్టీలు బలమైన లాభాలతో ముగిశాయి.


ఈ నేపథ్యంలో మార్కెట్‌లో అద్భుతమైన పెరుగుదల నేపథ్యంలో మదుపర్లు(investors) నిమిషాల్లోనే లక్షల కోట్ల రూపాయలు ఆర్జించారు. ప్రధానంగా IT, మెటల్ మినహా అన్ని నిఫ్టీ రంగాల సూచీలు గ్రీన్‌లో మొదలయ్యాయి. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ షేర్లలో కూడా కొనుగోళ్ల ట్రెండ్‌ కొనసాగింది. ఈ కారణంగా ఈరోజు బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.3.03 లక్షల కోట్లు పెరిగింది. ఈ క్రమంలో మార్కెట్ ప్రారంభమైన వెంటనే ఇన్వెస్టర్లు రూ.3.03 లక్షల కోట్లు లాభపడ్డారు.


77,017 స్థాయి వద్ద ప్రారంభమైన తర్వాత, సెన్సెక్స్ మరింత ఊపందుకుని 77,079.04 స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో BSE ఇండెక్స్ కొత్త ఆల్ టైమ్ హై లెవెల్ రికార్డుకు చేరుకుంది. మార్కెట్‌లో ట్రేడింగ్ ప్రారంభం కాగానే దాదాపు 2196 షేర్లు లాభాలతో గ్రీన్‌మార్క్‌లో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత 452 కంపెనీల షేర్లు క్షీణతతో రెడ్ మార్క్‌లో ప్రారంభమయ్యాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో నిఫ్టీ ఇండెక్స్‌లో అదానీ షేర్లు పెరిగాయి. వీటిలో అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్, బజాజ్ ఆటో, కోల్ ఇండియా, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు గరిష్టంగా లాభపడ్డాయి. ఇదే సమయంలో టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, హిందాల్కో షేర్లు క్షీణతను నమోదు చేశాయి.


ఇది కూడా చదవండి:

Gold and Silver Rate: రెండో సారి తగ్గిన బంగారం, వెండి..ఎంతకు చేరాయంటే


అప్రమత్తతే మేలు !

For Latest News and Business News click here

Updated Date - Jun 10 , 2024 | 10:54 AM