Share News

Jio Bumper Offer: రూ. 148 కే 12 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సబ్‌స్క్రిప్షన్.. ఫుల్ డీటేయిల్స్ ఇవే..

ABN , Publish Date - Jan 27 , 2024 | 08:11 PM

Reliance Jio Bumper Offer: భారతదేశపు అతిపెద్ద టెలికాం కంపెనీ రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం అదిరిపోయే ఆఫర్ ప్రవేశపెట్టింది. జస్ట్ రూ. 148 లకే ఓటీటీ(OTT) ప్రయోజనాలతో కూడిన ప్లాన్ అందిస్తోంది. అలాగని ఒకటి రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కాదండోయ్.. 12 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సబ్‌స్క్రిప్షన్ ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో..

Jio Bumper Offer: రూ. 148 కే 12 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సబ్‌స్క్రిప్షన్.. ఫుల్ డీటేయిల్స్ ఇవే..
Jio New Recharge Plans

Reliance Jio Bumper Offer: భారతదేశపు అతిపెద్ద టెలికాం కంపెనీ రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం అదిరిపోయే ఆఫర్ ప్రవేశపెట్టింది. జస్ట్ రూ. 148 లకే ఓటీటీ(OTT) ప్రయోజనాలతో కూడిన ప్లాన్ అందిస్తోంది. అలాగని ఒకటి రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కాదండోయ్.. 12 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సబ్‌స్క్రిప్షన్ ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో JioCinema Premium, SonyLIV వంటి ప్రధాన ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. తక్కువ ధరకే OTT బండిల్ ప్రీపెయిడ్ ప్లాన్ కోసం ఆలోచిస్తున్నట్లయితే.. జియో రూ. 148 ప్లాన్ బెటర్ ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు. ఈ ప్లాన్‌లో మరిన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి అవేంటో ఓసారి చూద్దాం..

రిలయన్స్ జియో రూ. 148 ప్లాన్ బెనిపిట్స్..

ఈ జియో టీవీ ప్లాట్‌ఫామ్‌కు కొనసాగింపుగా జియో టీవీ ప్రీమియంతో పాటు రూ. 148 ప్లాన్ తీసుకువచ్చారు. ఈ ప్లాన్ తీసుకున్న వినియోగదారులు.. జియో టీవీ ప్రీమియంతో పాటు ఒకే లాగిన్‌ కింద 12 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను యాక్సెస్ చేయొచ్చు. జియో సినిమా ప్రిమియం కంటెంట్ జియో సినిమా ప్లాట్‌ఫామ్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

12 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఇవే..

ఇక రూ. 148 తో రీచార్జ్ చేసుకుంటే.. 10 జీబీ డేటా వస్తుంది. 28 రోజుల గడువు ఉంటుంది. జియోటీవీ ప్రిమియం కూడా గడువు కూడా 28 రోజులు మాత్రమే ఉంటుంది. అయితే, ప్రీపెయిడ్ వినియోగదారులకే ఈ ప్లాన్ వర్తిస్తుంది. ఈ ప్లాన్‌లో భాగంగా SonyLIV, ZEE5, JioCinema Premium, Lionsgate Play, Discovery+, SunNXT, Kanchha Lanka, Planet Marathi, Chaupal, DocuBay, EPIC On, Hoichoi వంటివి ఈ ప్లాన్‌లో యాక్సెస్ అవ్వొచ్చు. JioCinema ప్రీమియం కోసం MyJio యాప్ ద్వారా కస్టమర్‌కు డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాగా, నిర్ణీత 10GB హై-స్పీడ్ డేటా వినియోగం తర్వాత, డేటా స్పీడ్ 64 Kbpsకి తగ్గుతుంది.

Updated Date - Jan 27 , 2024 | 08:16 PM