Share News

Stock Market: స్టాక్ మార్కెట్‌పై మహారాష్ట్ర ఎన్నికల ప్రభావం.. తగ్గుతుందా, పెరగనుందా..

ABN , Publish Date - Nov 23 , 2024 | 01:49 PM

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపిస్తాయా లేదా, చూపిస్తే వచ్చే సోమవారం స్టాక్ మార్కెట్ తీరు ఎలా ఉంటుంది. గతంలో ఎలా ఉందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Stock Market: స్టాక్ మార్కెట్‌పై మహారాష్ట్ర ఎన్నికల ప్రభావం.. తగ్గుతుందా, పెరగనుందా..
Maharashtra elections effect stockmarket

మహారాష్ట్రలో 288 స్థానాల అసెంబ్లీ ఎన్నికల (Maharashtra Elections 2024) ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈరోజు కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్‌లో చాలా సర్వేలు బీజేపీ నేతృత్వంలోని కూటమి గెలుస్తుందని చెప్పాయి. ఈ క్రమంలో నేడు వెలువడుతున్న ఫలితాలలో బీజేపీ కూటమి మెజారిటీ 145 స్థానాల కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఆధిక్యంలో ఉంది. అయితే ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం వచ్చే సోమవారం స్టాక్ మార్కెట్లపై (stock markets) ప్రభావం చూపుతుందా. చూపితే ఎలా ఉంటుందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.


క్షీణత తర్వాత పునరాగమనం

దీనికి ముందు పలు ఎగ్జిట్ పోల్స్‌లో సర్వేలు బీజేపీ కూటమి గెలుస్తుందని చెప్పడంతో శుక్రవారం స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. స్టాక్ మార్కెట్లు 7 వారాల క్షీణత తర్వాత అద్భుతమైన పునరాగమనం చేశాయి. దీనికి ముందు అదానీ లంచం కేసు కూడా స్టాక్ మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది. మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ నేతృత్వంలోని మహాకూటమి విజయం సాధిస్తే స్టాక్ మార్కెట్లు ఇంకా పుంజుకుంటాయని పలువురు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ మరికొంత మంది మాత్రం తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.


హంగ్ ఏర్పడితే ఎలా..

మహారాష్ట్ర అసెంబ్లీలో హంగ్ ఏర్పడే అవకాశం ఉంటే స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకులకు లోనుకావచ్చని నిపుణులు చెబుతున్నారు. బీజేపీ విజయం మార్కెట్ సెంటిమెంట్‌ను మెరుగుపరుస్తుందని అంటున్నారు. మరికొంత మంది మాత్రం స్టాక్ మార్కెట్ ప్రభావాన్ని అతిగా అంచనా వేయవద్దని హెచ్చరిస్తున్నారు. అయితే గతంలో ఎన్నికల సమయంలో స్టాక్ మార్కెట్లు ఎలా ప్రభావితం అయ్యాయనే విశేషాలను కూడా ఇప్పుడు చుద్దాం.


గతంలో స్టాక్ మార్కెట్ తీరు

మహారాష్ట్ర ఎన్నికల సమయంలో స్టాక్ మార్కెట్ పనితీరు గతంలో ఎలా ఉందంటే.. 2004-2009 సమయంలో నిఫ్టీ 165.43% స్థాయికి చేరుకుంది. (2009-2014)లో 53%, (2014-2019)లో 45.31%, (2019-2024)లో 119.85% పెరిగింది. ఇదే సమయంలో సెన్సెక్స్ 197.04%, 59.75%, 45.44%, 93.62% వృద్ధి చెందింది. ఇది ఆర్థిక వృద్ధి, సంక్షోభాల నుంచి కోలుకోవడం, కోవిడ్-19 వంటి సవాళ్ల సమయంలో హెచ్చుతగ్గులకు లోనైంది.


శుక్రవారం మార్కెట్ ఎలా ఉందంటే..

శుక్రవారం (నవంబర్ 22) భారత స్టాక్ మార్కెట్లు గత 5 నెలల్లో అతిపెద్ద పెరుగుదలను చవిచూశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,961.32 పాయింట్లు లేదా 2.54 శాతం జంప్‌తో 79,117.11 వద్ద ముగిసింది. నిఫ్టీ 557.35 పాయింట్లు లేదా 2.39 శాతం జంప్ చేసి 23,907.25 స్థాయికి చేరుకుంది. మరోవైపు బంగారం, వెండి ధరలు కూడా పుంజుకున్నాయి.


ఇవి కూడా చదవండి:

Bank Holidays: వచ్చే నెలలో 17 రోజులు బ్యాంకులు బంద్.. కారణమిదే..


Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..

Aadit Palicha: చదువు, జాబ్ వదిలేసి స్టార్టప్ పెట్టాడు.. ఇప్పుడు రూ.4300 కోట్ల సంపదకు..

Read More Business News and Latest Telugu News

Updated Date - Nov 23 , 2024 | 01:51 PM