Share News

GST: జీఎస్టీ వసూళ్లలో చరిత్ర సృష్టించిన భారత్.. ఇది రెండో రికార్డ్

ABN , Publish Date - Apr 01 , 2024 | 05:39 PM

ఒకే దేశం ఒకే పన్ను విధానంతో తీసుకొచ్చిన గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(జీఎస్టీ) ప్రభుత్వానికి లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకొస్తోంది. దేశీయ అమ్మకాలతో పాటు దిగుమతులు కూడా జోరుగా సాగడంతో జీఎస్టీ వసూళ్లు మార్చి నెలలో 11.5 శాతం పెరిగి రూ.1.78 లక్షల కోట్లకు చేరాయి.

GST: జీఎస్టీ వసూళ్లలో చరిత్ర సృష్టించిన భారత్.. ఇది రెండో రికార్డ్

ఢిల్లీ: ఒకే దేశం ఒకే పన్ను విధానంతో తీసుకొచ్చిన గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(జీఎస్టీ) ప్రభుత్వానికి లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకొస్తోంది. దేశీయ అమ్మకాలతో పాటు దిగుమతులు కూడా జోరుగా సాగడంతో జీఎస్టీ వసూళ్లు మార్చి నెలలో 11.5 శాతం పెరిగి రూ.1.78 లక్షల కోట్లకు చేరాయి. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 2023-మార్చి 2024) స్థూల GST వసూళ్లు రూ.20.14 లక్షల కోట్ల ఆదాయం సమకూరింది.

ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరం కంటే 11.7 శాతం ఎక్కువ. 2024 ఆర్థిక సంవత్సరం సగటు నెలవారీ స్థూల సేకరణ రూ.1.68 లక్షల కోట్లుగా ఉంది. అంతకుముందు 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల కోట్లకుపైనే వసూళ్లు జరిగాయి. "మార్చి 2024లో జీఎస్టీ (GST) ఆదాయం 11.5 శాతం వార్షిక వృద్ధితో రూ.1.78 లక్షల కోట్ల వద్ద రెండో అత్యధిక వసూళ్లు సాధించింది .


దేశీయంగా GST వసూళ్లు గణనీయంగా పెరిగాయి. లావాదేవీలు 17.6 శాతంగా ఉన్నాయి’’ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 2023 ఏప్రిల్‌లో అత్యధిక జీఎస్టీ వసూళ్లు రూ.1.87 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. మార్చి 2024 నాటికి రీఫండ్‌ల GST రాబడి నికరంగా రూ.1.65 లక్షల కోట్లు. ఇది గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 18.4 శాతం ఎక్కువ.

X Click here: ఎక్స్‌లో క్లిక్ హియర్ ట్రెండ్.. అసలేంటిది.. దీంట్లో మనమూ భాగస్వామ్యం కావచ్చా

వినియోగంలో జోరుకు సంకేతం..

జీఎస్టీ వసూళ్లలో వృద్ధి వినియోగంలో పెరిగిన జోరుకు దర్పణమని పరిశీలకులంటున్నారు. సుమారుగా అన్ని రాష్ట్రాలు జీఎస్టీ వసూళ్లలో 8 నుంచి 21 శాతం వృద్ధిని నమోదు చేశాయని చెబుతున్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 01 , 2024 | 05:43 PM