Share News

Center Blocked: 18 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన కేంద్రం..ఎందుకంటే

ABN , Publish Date - Mar 14 , 2024 | 03:46 PM

కేంద్ర ప్రభుత్వం తాజాగా 18 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లపై నిషేధం విధించింది. దీంతోపాటు 19 వెబ్‌సైట్లు, 10 యాప్‌లు, 57 సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను కూడా ప్రభుత్వం బ్లాక్ చేసింది. అయితే ఎందుకు ఇలా చేసింది, కారణాలు ఏంటనేది ఇక్కడ చుద్దాం.

Center Blocked: 18 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన కేంద్రం..ఎందుకంటే

కేంద్ర ప్రభుత్వం(Union government) 18 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లపై(OTT platforms) నిషేధం(banned) విధించింది. దీంతోపాటు 19 వెబ్‌సైట్లు, 10 యాప్‌లు, 57 సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను కూడా ప్రభుత్వం బ్లాక్ చేసింది. అయితే మహిళల అసభ్యకరమైన కంటెంట్‌(content) ప్రచారం, నిబంధనలను ఉల్లంఘించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతేకాదు దీనికంటే ముందు ఈ ప్లాట్‌ఫారమ్‌లను చాలాసార్లు హెచ్చరించామని, అయినా కూడా మార్పు రాని క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. IT చట్టంలోని సెక్షన్ 67, 67A, IPCలోని సెక్షన్ 292 సహా పలు సెక్షన్ల ప్రకారం ఈ ప్లాట్‌ఫారమ్‌లు నిషేధించబడ్డాయి.

దీంతో ఈ క్రింది ఓటీటీ యాప్‌లపై నిషేధం అమలులో ఉంది.

-డ్రీమ్స్ ఫిల్మ్స్

-వూవీ

-ఏస్స్మా

-అన్ కట్ అడ్డా

-ట్రై ఫ్లిక్స్

-X ప్రైమ్

-నియాన్ X VIP

-మూడ్ఎక్స్

-బేషరమ్స్

-హాంటర్స్

-రాబిట్

-Xtramood

-న్యూఫ్లిక్స్

-Mojflix

-హాట్ షాట్స్ VIP

-ఫ్యూగి

-చికూఫ్లిక్స్

-ప్రైమ్ ప్లే


అయితే బ్లాక్ చేయబడిన ఓటీటీ యాప్‌లలో ఒకటి Google Play Storeలో కోటి కంటే ఎక్కువ సార్లు డౌన్‌లోడ్(downloads) చేయబడింది. దీంతో పాటు రెండు యాప్‌లు 50 లక్షల కంటే ఎక్కువ డౌన్‌లోడ్లను కల్గి ఉంది. ఈ యాప్‌లు తమ కంటెంట్‌ను ప్రచారం చేయడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను కూడా ఉపయోగిస్తాయి. ఈ OTT ప్లాట్‌ఫారమ్‌లు వారి సోషల్ మీడియా ఖాతాలలో 32 లక్షల కంటే ఎక్కువ మంది వినియోగదారులను కలిగి ఉన్నాయని కేంద్రం తెలిపింది. ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Ranji trophy 2024: 42వ సారి రంజీ ట్రోఫీ గెల్చుకున్న ముంబై

Updated Date - Mar 14 , 2024 | 03:46 PM