Share News

Anil Ambani: నష్టాల్లో ఉన్న ముఖేష్ అంబానీ సోదరుడికి మరో షాక్

ABN , Publish Date - May 25 , 2024 | 09:04 PM

శంలోనే ప్రముఖ పారిశ్రామిక వేత్త, అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ(Anil Ambani)కి మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఆర్థిక నష్టాల్లో ఉన్న అనిల్‌కు మరో దెబ్బ పడింది. తాజాగా అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్(Reliance Power) లిమిటెడ్ మార్చి త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది.

Anil Ambani: నష్టాల్లో ఉన్న ముఖేష్ అంబానీ సోదరుడికి మరో షాక్
Anil Ambani Reliance Power loss

దేశంలోనే ప్రముఖ పారిశ్రామిక వేత్త, అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ(Anil Ambani)కి మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఆర్థిక నష్టాల్లో ఉన్న అనిల్‌కు మరో దెబ్బ తగిలింది. తాజాగా అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్(Reliance Power) లిమిటెడ్ మార్చి త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. దీంతో ఈ సంస్థ రిలయన్స్ పవర్ రూ.397.66 కోట్ల నష్టాన్ని(loss) చవిచూసింది. గత ఏడాది ఇదే కాలంలో రూ.321.79 కోట్ల లాభాన్ని ఆర్జించగా, ఇప్పుడు భారీ నష్టాలను మిగిల్చింది. ఇంధన ధరల పెరుగుదల కారణంగా కంపెనీ ఈ నష్టాన్ని చవిచూసింది.


అయితే ఈ కంపెనీ మొత్తం ఆదాయం 2024 జనవరి-మార్చి త్రైమాసికంలో రూ. 1,853.32 కోట్ల నుంచి రూ. 2,193.85 కోట్లకు పెరిగింది. ఖర్చుల గురించి మాట్లాడితే, త్రైమాసికంలో ఇంధన ధర రూ.953.67 కోట్లకు పెరిగింది. ఇది 2022-23 ఆర్థిక సంవత్సరంలో జనవరి-మార్చి కాలంలో రూ.823.47 కోట్లుగా ఉంది. మొత్తం 2023-24 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నష్టం 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.470.77 కోట్ల నుంచి రూ.2,068.38 కోట్లకు పెరిగింది.


శుక్రవారం అనిల్ అంబానీ(Anil Ambani)కి చెందిన రిలయన్స్ పవర్ షేర్లు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లాభాలతో ముగిశాయి. 0.91 శాతం లేదా రూ.0.24 లాభంతో రూ.26.64 వద్ద ముగిసింది. ఈ షేర్ 52 వారాల గరిష్టం రూ.34.35. కాగా, 52 వారాల కనిష్ట ధర రూ.12.01. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ విలువ ప్రస్తుతం రూ.10,701.21 కోట్లుగా ఉంది.

రిలయన్స్ పవర్‌కు చెందిన రెండు అనుబంధ కంపెనీలు ఇటీవలే ఆథమ్ ఇన్వెస్ట్‌మెంట్స్ విభాగమైన రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్‌తో రూ.1023 కోట్ల రుణాన్ని సెటిల్ చేశాయి. కలై పవర్ ప్రైవేట్ లిమిటెడ్, రిలయన్స్ క్లీంజెన్ లిమిటెడ్ RCFLతో ఒప్పందంపై సంతకం చేశాయి. అదనంగా రిలయన్స్ పవర్ మహారాష్ట్రలోని 45 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టును JSW రెన్యూవబుల్ ఎనర్జీకి రూ. 132 కోట్లకు విక్రయించింది.


ఇది కూడా చదవండి:

Investment Plan: 10 ఏళ్లలో టాప్ 5 ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్.. ఎంత రిటర్న్స్ వచ్చాయంటే

CIBIL Score: సిబిల్ స్కోర్ ఎక్కువ సార్లు చెక్ చేస్తున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు


Read Latest Business News and Telugu News

Updated Date - May 25 , 2024 | 09:07 PM