Share News

Anant Ambani: అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలో రిహన్నా రిహార్సల్ వీడియో లీక్

ABN , Publish Date - Mar 01 , 2024 | 08:02 AM

దేశంలో ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలో పాల్గొనేందుకు బాలీవుడ్ స్టార్స్‌తో పాటు, పలువురు ఇంటర్నేషనల్ స్టార్స్ కూడా వచ్చారు. అందుకు సంబంధించిన కొన్ని వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో లీకై హల్‌చల్ చేస్తున్నాయి.

Anant Ambani: అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలో రిహన్నా రిహార్సల్ వీడియో లీక్

దేశంలో ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ(Anant Ambani), రాధిక మర్చంట్(Radhika Merchant) ప్రీ వెడ్డింగ్ వేడుకలో పాల్గొనేందుకు బాలీవుడ్ స్టార్స్‌తో పాటు, పలువురు ఇంటర్నేషనల్ స్టార్స్ కూడా వచ్చారు. దీంతో ఇప్పుడు గుజరాత్‌లోని జామ్‌నగర్(jamnagar) ప్రీ వెడ్డింగ్(Pre Wedding) సన్నాహాలకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియా(social media)లో లీకై హల్‌చల్ చేస్తున్నాయి. ఓ వీడియోలో రిహన్నా కోసం సిద్ధం చేసిన గ్రాండ్ స్టేజ్ కనిపిస్తుంది. ఆ క్రమంలో సమీప భవనాల్లోని ప్రజలు నృత్యం చేస్తూ కనిపించారు. భవనంలో ఉన్న వ్యక్తులు ఆ ఈవెంట్‌లో ప్లే చేయబడే పాటలపై సంగీత కచేరీని వింటూ ఆస్వాదించడం వీడియోల్లో కనిపించింది.


ఇంటర్నేషనల్ స్టార్ పాప్ ఐకాన్ రిహన్నా ప్రస్తుతం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్నారు. అనంత్ అంబానీ, కాబోయే కోడలు రాధికా మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ కోసం ప్రపంచం నలుమూలల నుంచి అనేక మంది స్టార్‌లను ఆహ్వానించారు. అయితే లీకైన(Leaked) వీడియోలను చూస్తే మాత్రం జామ్‌నగర్‌లో ఏదో గ్రాండ్‌గా జరగబోతుందనేది ఖాయంగా తెలుస్తోంది. ఇది ఇంతకు ముందు జరిగిన అనేక వేడుకల కంటే పెద్దగా ఉంటుందని అనిపిస్తుంది. మార్చి 1 నుంచి మార్చి 3 వరకు జరగనున్న ఈ గ్రాండ్ ఈవెంట్‌లో రిహానా(Rihanna) కూడా అలరించనుంది. ఈ వేడుక నేడు మొదలు కానున్న నేపథ్యంలో మూడు రోజుల పాటు జామ్ నగర్ ప్రాంతం సందడిగా మారనుంది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Bill Gates: ప్రధాని మోదీని కలిసిన బిల్ గేట్స్.. కారణమిదేనా?

Updated Date - Mar 01 , 2024 | 09:03 AM