Share News

T20 World Cup-Airtel New Plans: గుడ్ న్యూస్.. అదిరిపోయే ప్లాన్స్ ప్రకటించిన ఎయిర్‌టెల్..

ABN , Publish Date - Jun 06 , 2024 | 02:18 PM

Airtel New Recharge Plans for T20 World Cup: క్రికెట్ అభిమానులకు ఎయిర్‌టెల్ గుడ్ న్యూస్ చెప్పింది. కంపెనీ తన కస్టమర్ల కోసం అతి తక్కువ ధరకే అద్భుతమైన ఆఫర్లు ప్రకటించింది. టీ20 ప్రకంప్‌ టోర్నమెంట్‌ను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ ప్లాన్‌లను ప్రకటించింది. ఎయిర్‌టెల్ తన వినియోగదారుల కోసం 3 కొత్త ప్లాన్స్‌ని ప్రారంభించింది. మరి ఆ ప్లాన్స్ ఏంటనేది ఓసారి చూద్దాం..

T20 World Cup-Airtel New Plans: గుడ్ న్యూస్.. అదిరిపోయే ప్లాన్స్ ప్రకటించిన ఎయిర్‌టెల్..
T20 World Cup-Airtel New Plans

Airtel New Recharge Plans for T20 World Cup: క్రికెట్ అభిమానులకు ఎయిర్‌టెల్ గుడ్ న్యూస్ చెప్పింది. కంపెనీ తన కస్టమర్ల కోసం అతి తక్కువ ధరకే అద్భుతమైన ఆఫర్లు ప్రకటించింది. టీ20 ప్రకంప్‌ టోర్నమెంట్‌ను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ ప్లాన్‌లను ప్రకటించింది. ఎయిర్‌టెల్ తన వినియోగదారుల కోసం 3 కొత్త ప్లాన్స్‌ని ప్రారంభించింది. మరి ఆ ప్లాన్స్ ఏంటనేది ఓసారి చూద్దాం..


రూ. 499 ప్లాన్..

ఎయిర్‌టెల్ రూ. 499 కొత్త ప్లాన్‌ని విడుదల చేసింది. ఈ ప్లాన్‌ 28 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. ప్రతిరోజూ 3జీబీ డేటా వస్తుంది. అపరిమిత కాలింగ్ సౌకర్యం కూడా ఉంటుంది. ఈ ప్లాన్‌తో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ 3 నెలల పాటు అందనుంది. అలాగే, ఎయిర్‌టెల్ స్ట్రీమ్ ప్లే‌తో వినియోగదారులు 20 కంటే ఎక్కువ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను ఉచితంగా యాక్సెస్ పొందవచ్చు.


రూ. 869 ప్లాన్..

ఎయిర్‌టెల్‌ మరో రూ. 869 ప్లాన్‌ను లాంచ్ చేసింది. ఈ ప్లాన్‌లో 84 రోజుల వ్యాలిడిటీ అందిస్తోంది. దీంతోపాటు డైలీ 2జీబీ డేటా వస్తుంది. అలాగే అపరిమిత కాలింగ్ సౌకర్యం కూడా లభిస్తుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు 3 నెలల పాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మెంబర్‌షిప్‌ను పొందవచ్చు.


ఎయిర్‌టెల్ వార్షిక ప్లాన్‌..

ఎయిర్‌టెల్ తన కస్టమర్ల కోసం వార్షిక ప్లాన్‌ను కూడా ప్రారంభించింది. ఇందుకోసం వినియోగదారులు రూ.3,359 తో రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. 365 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఈ రీఛార్జ్ ప్లాన్‌లో డైలీ 2.5 GB డేటాతో ఒక సంవత్సరం పాటు Disney Plus Hotstar ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు.

For More Business News and Telugu News..

Updated Date - Jun 06 , 2024 | 02:18 PM