Share News

Salary Hike: సిబ్బందికి రూ.1.8 లక్షల బోనస్‌ ప్రకటించిన ప్రముఖ సంస్థ

ABN , Publish Date - May 23 , 2024 | 09:30 PM

టాటా గ్రూపు(Tata Group) ఆధీనంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత మొదటి సారిగా ఎయిరిండియా(Air India) ఉద్యోగులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఉద్యోగులకు వేతనాలను పెంచేసింది. దీంతోపాటు పైలెట్లకు వారి పనితీరు ఆధారంగా బోనస్ ఇవ్వనున్నట్లు సంస్థ ప్రకటించింది.

Salary Hike: సిబ్బందికి రూ.1.8 లక్షల బోనస్‌ ప్రకటించిన ప్రముఖ సంస్థ
Air India announces salary hike

టాటా గ్రూపు(Tata Group) ఆధీనంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత మొదటి సారిగా ఎయిరిండియా(Air India) ఉద్యోగులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. సంస్థ ఉద్యోగులకు వేతనాలను పెంచేసింది. దీంతోపాటు పైలెట్లకు వారి పనితీరు ఆధారంగా బోనస్ ఇవ్వనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఎయిర్ ఇండియా చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ రవీంద్ర కుమార్ ఉద్యోగులకు జీతం పెంపు, పనితీరు బోనస్‌ వివరాలను ప్రకటించారు. ఈ క్రమంలో క్యారియర్ స్థాయి మొదటి అధికారి నుంచి సీనియర్ కమాండర్ స్థానాల వరకు నెలకు స్థిర వేతనంలో రూ. 5,000 నుంచి రూ. 15,000 వరకు జీతం పెంచినట్లు ప్రకటించారు.


మరోవైపు విమానయాన సంస్థ జూనియర్ ఫస్ట్ ఆఫీసర్ నుంచి సీనియర్ కమాండర్ల వరకు ఏడాదికి రూ. 42,000 నుంచి రూ. 1.8 లక్షల వరకు బోనస్‌ను ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో ఫస్ట్ ఆఫీసర్, కెప్టెన్ వార్షిక బోనస్‌గా రూ. 60,000 అందుకోగా, కమాండర్, సీనియర్ కమాండర్‌లు వరుసగా రూ. 1.32 లక్షలు, రూ. 1.80 లక్షల బోనస్‌లను అందుకుంటారని వెల్లడించారు. అయితే జూనియర్ ఫస్ట్ ఆఫీసర్లకు మాత్రం జీతాల పెంపు ప్రకటించలేదని స్పష్టం చేశారు.


ఇక జీతం పెంపు నిర్ణయం ఏప్రిల్ 1, 2024 నుంచి అమల్లోకి వస్తుందని సంస్థ ప్రకటించింది. ఈ కంపెనీలో దాదాపు 18,000 మంది ఉద్యోగులు ఉన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో పనితీరు ఆధారంగా ఉద్యోగులకు బోనస్ ఇవ్వబడిందని కంపెనీ వర్గాలు తెలిపాయి. జనవరి 2022లో ఎయిర్ ఇండియా నియంత్రణను ప్రభుత్వం నుంచి టాటా గ్రూప్‌కు వచ్చిన తర్వాత ఉద్యోగుల జీతం పెరగడం ఇదే మొదటిసారి.


ఇది కూడా చదవండి:

Bank Holidays: జూన్ 2024లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులో తెలుసా..ఈసారి ఏకంగా.

Mileage Tips: పెట్రోల్, డీజిల్ ఎంత పోయించుకుంటే బెటర్.. ఫుల్ ట్యాంక్ లేదా లీటర్

Read Latest Business News and Telugu News

Updated Date - May 23 , 2024 | 09:32 PM