Share News

AP Elections: ఈ సైలెన్స్ దేనికి సంకేతం..!

ABN , Publish Date - May 14 , 2024 | 04:35 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అధికార వైసీపీలోని అగ్గి వీరులు.. అదే నండి ఫైర్ బ్రాండ్లు కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, ఆర్కే రోజా, జోగి రమేష్, అంబటి రాంబాబు వగైరా వగైరా ఎక్కడ అనే ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతుంది.

AP Elections: ఈ సైలెన్స్ దేనికి సంకేతం..!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అధికార వైసీపీలోని అగ్గి వీరులు.. అదే నండి ఫైర్ బ్రాండ్లు కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, ఆర్కే రోజా, జోగి రమేష్, అంబటి రాంబాబు వగైరా వగైరా ఎక్కడ అనే ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతుంది. నిత్యం మీడియా ముందుకు వచ్చి చెలరేగిపోయే వీళ్లు.. ఇలా ఎన్నికల పోలింగ్ కాగానే చప్పగా చల్లారి పోయినట్లు స్తబ్దుగా ఉండడం ఏమీ బాగాలేదనే ఓ అభిప్రాయం అయితే సదరు సర్కిల్‌లో వ్యక్తమవుతుంది.

Thief At Flight : విమాన ప్రయాణికులే టార్గెట్..!

అంతేకాదు... వీరు సైలెంట్ కావడం వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయా? అనే ఓ ప్రశ్న సైతం ఉత్పన్నమవుతున్నట్లు తెలుస్తుంది. ఈ ఎన్నికల్లో ఆంధ్ర ఓటర్లు భారీగా పోలింగ్‌ కేంద్రాలకు పోటెత్తారు. ఆ క్రమంలో రాష్ట్రంలో 81 శాతం పోలింగ్ నమోదు అయిందని ఇప్పటికే ఎన్నికల సంఘం సీఈవో మీడియా ముందుకు వచ్చి అధికారికంగా ప్రకటించారు.

Election Commission: సీఎం జగన్ కుట్రను భగ్నం చేసిన ఎన్నికల కమిషన్..


అయితే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తడం కంటే.. ముందే అంటే... పోలింగ్‌కు ఒక రోజు ముందు తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల్లోని ఆంధ్రా ఓటర్లంతా తమ ఓటు హక్కు వినియోగించుకొనేందుకు వారి వారి స్వస్థలాలకు చేరుకున్నారు. వీరంతా ఇలా ఓటు హక్కు వినియోగించుకొనేందుకు రాష్ట్రానికి తరలి రావడంతో.. మన పని అయిపోయిందనే ఓ విధమైన డైలమాలోకి ప్యాన్ పార్టీలోని పైర్ బ్రాండ్లు వెళ్లి పోయాయనే ఓ ప్రచారం సైతం సాగింది.

Delhi Liquor Case: ఎమ్మెల్సీ కవితకు షాక్.. మరోసారి తీవ్ర నిరాశ

ఇక పోలింగ్ స్వల్పంగా జరిగి ఉంటే... పార్టీ గెలుపు నల్లేరు మీద నడకే అయి ఉండేదనే అభిప్రాయం ఉండేది. కానీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఆంధ్రా ఓటర్లు.. తమ ఓటు హక్కును నూటికి నూరు శాతం వినియోగించుకున్నారు. అదీకాక అలా వచ్చిన ఓటర్లలో ఓ విధమైన కసి అయితే కనిపించిందని ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.


మరోవైపు నిన్న పోలింగ్ వేళ.. పోలింగ్ కేంద్రాల వద్ద పలువురు వైసీపీ అగ్రనేతలు చిందులు తొక్కారు. అనంతరం వారు కనిపించకుండా పోయారనే ఓ చర్చ సైతం నడుస్తుంది. ఇక మంగళవారం మీడియా ముందు మాజీ మంత్రి, నరసారావు పేట వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. పోలింగ్ వేళ.. పోలీసులు ప్రతిపక్ష టీడీపీకి ప్రీ హ్యాండ్ ఇచ్చారని.. వైసీపీని నియంత్రించారంటూ ఆరోపించారు. అలాగే పోలింగ్ ముగిశాక మంత్రి ఆర్కే రోజా సైతం స్పందించారు.

PM Modi: ఎన్డీయే నేతలతో మోదీ బలప్రదర్శన ...ఎవరేమన్నారంటే?

తనకు ప్రత్యర్థులు ఎక్కడో లేరిని.. తన పార్టీలోనే ఉన్నారంటూ ఓ విధమైన నైరాశ్యంతో ఆమె మాట్లాడారు. ఇక నాని బ్రదర్స్ అయితే ఎన్నికలు అయిన తర్వాత నోరు మెదపలేదు. మరి ఎన్నికలు అయిపోయాయి. పార్టీ అధినేత, సీఎం వైయస్ జగన్‌.. వై నాట్ 175 అంటూ గతంలో తన అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశాల్లో తన పార్టీ నేతలను ప్రశ్నించారు.


కనీసం సీఎం వైయస్ జగన్‌ను గౌరవిస్తూ.. ఆయన సంధించిన ఆ ఒకే ఒక్క ప్రశ్నకు పోలింగ్ పూర్తి అయిన తర్వాత ఈ అగ్గి వీరులు సమాధానం ఇచ్చి ఉంటే బావుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.

AP Elections: తొలిసారి ఓటు కోసం రైలుకు ‘గ్రీన్ ఛానల్’

అంటే ఈ ఎన్నికల్లో తామకు 175కి 175 స్థానాలు వస్తాయని చెప్పడం కానీ.. లేకుంటే 100 సీట్లతో గెలుస్తామని కానీ, స్వల్ప అధిక్యతతో విజయం సాధిస్తామని కానీ చెప్పకుండా.. ఇలా సైలెంట‌్‌గా ఉండడం చూస్తుంటే.. రాబోయే ఎన్నికల ఫలితాల కంటే.. నిన్న జరిగిన పోలింగ్ ఎఫెక్టే వీరిని సైలెంట్‌గా ఉంచుతుందనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు ఈ సందర్బంగా వ్యక్తం చేస్తున్నారు.

Read Latest National and Telugu News

Updated Date - May 14 , 2024 | 04:36 PM