Share News

YSRCP: వైసీపీ నేతల నయా స్కెచ్.. జగన్‌కు గట్టి దెబ్బే..!

ABN , Publish Date - Dec 27 , 2024 | 05:25 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ గతంలో చెప్పినట్లుగా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో దేవుడి స్క్రిప్ట్ మారి 6 మాసాలు ముగిసింది. రాష్ట్ర రాజకీయమే కాదండోయ్.. వైసీపీ విషయంలోనూ దేవుడు స్క్రిప్ట్ మార్చినట్లున్నాడు. అందుకే కాబోలు.. ఆ పార్టీ నేతలు పక్క చూపులు చూస్తున్నారు.

YSRCP: వైసీపీ నేతల నయా స్కెచ్.. జగన్‌కు గట్టి దెబ్బే..!
YSRCP

వైసీపీ అధినేత వైఎస్ జగన్ గతంలో చెప్పినట్లుగా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో దేవుడి స్క్రిప్ట్ మారి 6 మాసాలు ముగిసింది. రాష్ట్ర రాజకీయమే కాదండోయ్.. వైసీపీ విషయంలోనూ దేవుడు స్క్రిప్ట్ మార్చినట్లున్నాడు. అందుకే కాబోలు.. ఆ పార్టీ నేతలు పక్క చూపులు చూస్తున్నారు. అధికారం ఉన్న ఐదేళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వారంతా.. ఇప్పుడు ప్లీజ్ ప్లీజ్ అంటూ ఆయా పార్టీల వైపు చూస్తున్నారు. గల్లీ కార్యకర్త మొదలు.. బడా నాయకుల వరకూ చాలా మంది వైసీపీ నేతలు ఇతర పార్టీల్లో జంప్ అయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది నేతలు ఆయా పార్టీల్లో చేరిపోగా.. మరికొందరు నేతలు సైతం ఇదే బాటలో పయనించేందుకు సిద్ధంగా ఉన్నారు. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు


తిరుపతి, డిసెంబర్ 27: తిరుపతిలోని కొందరు వైసీపీ కార్పొరేటర్లు కొత్త కూటమిగా ఏర్పాటవుతున్నారు. ఎన్నికల అనంతరం ఎన్డీయే కూటమిలో చేరేందుకు పలువురు విఫలయత్నం చేసిన విషయం తెలిసిందే. ఇందుకు గల అడ్డంకులను సమీక్షించుకుని, వాటిని అధిగమించి టీడీపీ, జనసేనలో చేరేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. ఈ మేరకు గురువారం అందుబాటులో ఉన్న దాదాపు 10 మంది కార్పొరేటర్లు పాయ్ వైశ్రాయ్ హోటల్లో సమావేశమై చర్చించుకున్నారు. గత వైసీపీ పాలనలో టీడీపీ, జనసేన శ్రేణులను ఇబ్బందిపెట్టని కార్పొరేటర్లను చేర్చుకునేందుకు ఎన్డీయే ప్రభుత్వానికి ఇబ్బందిలేదని, గతంలో తామలా వ్యవహరించలేదు కాబట్టి పార్టీలో చేరేందుకు ఎలాంటి అడ్డంకులు ఉండవని అభిప్రాయపడ్డారు. అయితే ఆయా డివిజన్లలోని స్థానిక నాయకత్వాన్ని కూడా మెప్పించి పార్టీలో చేరేందుకు మార్గం సుగమం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. తద్వారా భవిష్యత్తులో ఎలాంటి గందరగోళం లేకుండా ముందుకుపోవచ్చని భావించారు.


గత కౌన్సిల్ తీర్మానం మేరకు కార్పొరేటర్లకు నెలలో ఒకసారి శ్రీవారి దర్శనం కల్పించాలని కోరుతూ టీటీడీ చైర్మన్‌ను కలవాలని నిర్ణయం తీసుకున్నారు. ఏదైనా పార్టీలో చేరేవరకు తాము ఎవరికీ అనుకూలంగా ఉండమని, ఆవిశ్వాసం కూడా పార్టీ నిర్ణయాల మేరకు ఉంటుందని తీర్మానం చేసుకున్నట్టు తెలిసింది. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, కార్పొరేటర్లు నరసింహాచారి (25వ డివిజన్), నరేంద్రనాధ్ (38), దూది కుమారి భర్త శివ(33), కుడితి సుబ్రమణ్యం (36), పొన్నాల చంద్ర (28), దొడ్డారెడ్డి మునిశేఖర్ (11), అనిల్ (50వ డివిజన్) సమావేశానికి హాజరైనట్టు తెలిసింది. మరికొంతమంది ఫోన్ ద్వారా మద్దతు తెలిపినట్టు సమాచారం.

Updated Date - Dec 27 , 2024 | 05:30 PM