Share News

YS Sharmila: కడప జిల్లాలో పర్యటించనున్న షర్మిల

ABN , Publish Date - Apr 02 , 2024 | 09:33 AM

నేడు కడప జిల్లాల్లో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి పర్యటించనున్నారు. షర్మిళ కాంగ్రెస్ కడప ఎంపీ అభ్యర్థిగా ఖరారైన నేపద్యంలో ఇడుపులపాయలోని తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద ప్రత్యేకప్రార్ధనలు చేసి అభ్యర్ధుల జాబితాను ఆమె విడుదల చేయనున్నారు.

YS Sharmila: కడప జిల్లాలో పర్యటించనున్న షర్మిల

కడప: నేడు కడప జిల్లాల్లో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి (YS Sharmila) పర్యటించనున్నారు. షర్మిళ కాంగ్రెస్ కడప ఎంపీ అభ్యర్థిగా ఖరారైన నేపద్యంలో ఇడుపులపాయలోని తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద ప్రత్యేకప్రార్ధనలు చేసి అభ్యర్ధుల జాబితాను ఆమె విడుదల చేయనున్నారు. సాయంత్రం కడపలో ఇఫ్తార్ విందు ఇతర కార్యక్రమాలలో షర్మిల పాల్గొననున్నారు.

Phone Tapping Case: నేటితో ముగియనున్న అడిషనల్ ఎస్పీల కస్టడీ

పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలారెడ్డి కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీచేయడం ఖాయమైంది. రాష్ట్రంలో కడప సహా ఐదు లోక్‌సభ సీట్లు, 114 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులను కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) ఖరారు చేసినట్లు తెలిసింది. ఈ జాబితాను మంగళవారం ఇడుపులపాయలో ప్రకటించనున్నారు. సీఈసీ సమావేశం సోమవారం ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌, ఏఐసీసీ ఎస్టీఎస్టీసెల్‌ చైర్మన్‌ కొప్పుల రాజు, షర్మిల పాల్గొన్నారు.

AP Elections: ఎన్నికల వేళ వెరీ ‘హాట్‌’!

మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు గాను 117 అసెంబ్లీ, 17 ఎంపీ స్థానాల అభ్యర్థుల ఎంపికపై ఈ సందర్భంగా చర్చించారు. కడప ఎంపీ స్థానంలో షర్మిల, రాజమండ్రి-గిడుగు రుద్రరాజు, విశాఖ-సత్యారెడ్డి, కాకినాడ-ఎంఎం పళ్లంరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం పోటీ చేయనున్నట్లు తెలిసింది. పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఎన్నికల బరిలో లేరని సమాచారం. కమ్యూనిస్టు పార్టీలతో సర్దుబాటు నేపథ్యంలో మిగిలిన స్థానాలను పెండింగ్‌లో పెట్టినట్లు తెలిసింది. కాంగ్రెస్‌ తొలి జాబితా ప్రకటన కోసం షర్మిల మంగళవారం కడప జిల్లాకు వెళ్తున్నారు.

వంచన వైసీపీదే!

మరిన్ని ఏపీ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 02 , 2024 | 12:36 PM