Share News

YCP: టీడీపీ అభ్యర్థినైన నన్ను గెలిపించండని కోరిన వైసీపీ అభ్యర్థి

ABN , Publish Date - Mar 20 , 2024 | 12:59 PM

ఎన్నికల సిత్రాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో వింతలూ విశేషాలకు లోటుండదు. ప్రచారంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. రోడ్లు ఊడ్చడం.. బజ్జీలేయడం రకరకాలవి చేస్తుంటారు. ఈక్రమంలోనే నేతలు అలవాటులో పొరపాటుగా నోరు కూడా జారుతూ ఉంటారు.

YCP: టీడీపీ అభ్యర్థినైన నన్ను గెలిపించండని కోరిన వైసీపీ అభ్యర్థి
YSRCP MLA Candidate

కాకినాడ: ఎన్నికల (Elections) సిత్రాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో వింతలూ విశేషాలకు లోటుండదు. ప్రచారంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. రోడ్లు ఊడ్చడం.. బజ్జీలేయడం రకరకాలవి చేస్తుంటారు. ఈక్రమంలోనే నేతలు అలవాటులో పొరపాటుగా నోరు కూడా జారుతూ ఉంటారు. తాజాగా ఓ వైసీపీ (YSRCP) అభ్యర్థి.. ‘టీడీపీ (TDP) అభ్యర్థినైన నన్ను గెలిపించాలి’ అని కోరాడు. అంతే క్షణాల్లో ఈ వీడియో వైరల్ అయిపోయింది. ఆ నోరు జారిన వ్యక్తి మరెవరో కాదు.. ప్రత్తిపాడు (Prathipadu) వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సుబ్బారావు (Varupula Subbarao). ప్రత్తిపాడు మండలం పోతులూరి గ్రామంలో వైసీపీ కార్యకర్తల సమావేశంలో ‘టీడీపీ అభ్యర్థనైన నన్ను గెలిపించండి’ అని నోరు జారి నాలుక్కరుచుకున్నారు.

AP Politics: రెచ్చిపోయిన ఎమ్మెల్యే.. కారు ఆపి మరీ వారిపై

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 20 , 2024 | 01:34 PM