Share News

YSRCP: వైసీపీ ప్రతిపక్ష హోదా అయినా దక్కించుకుంటుందా?

ABN , Publish Date - Jun 04 , 2024 | 11:55 AM

టీడీపీ అధినేత చంద్రబాబు ముందు చెప్పినట్టుగానే వైసీపీని చావు దెబ్బ కొట్టారు. దాదాపు 162 స్థానాల్లో టీడీపీ కూటమి హవా చాటుతోంది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళుతోంది. కౌంటింగ్ కేంద్రాల నుంచి వైసీపీ నేతలంతా ఇళ్ల బాట పట్టారు. కనీసం కంచుకోట అయిన రాయలసీమలోనూ వైసీపీ హవా చాటడం లేదు. కనీసం జగన్మోహన్ రెడ్డి కంచుకోట అయిన కడప జిల్లాలోనూ వైసీపీ ప్రభావం అంతంత మాత్రమే. కూటమి సునామీ ముందు వైసీపీ నిలవలేకపోయింది.

YSRCP: వైసీపీ ప్రతిపక్ష హోదా అయినా దక్కించుకుంటుందా?

లైవ్ అప్‌డేట్స్ కోసం..

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు ముందు చెప్పినట్టుగానే వైసీపీని చావు దెబ్బ కొట్టారు. దాదాపు 162 స్థానాల్లో టీడీపీ కూటమి హవా చాటుతోంది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళుతోంది. కౌంటింగ్ కేంద్రాల నుంచి వైసీపీ నేతలంతా ఇళ్ల బాట పట్టారు. కనీసం కంచుకోట అయిన రాయలసీమలోనూ వైసీపీ హవా చాటడం లేదు. కనీసం జగన్మోహన్ రెడ్డి కంచుకోట అయిన కడప జిల్లాలోనూ వైసీపీ ప్రభావం అంతంత మాత్రమే. కూటమి సునామీ ముందు వైసీపీ నిలవలేకపోయింది.


ఇక ఇప్పుడు ఉద్భవిస్తున్న ప్రశ్న ఏంటంటే.. వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదా అయినా దక్కించుకుంటుందా? అని. ప్రతిపక్ష హోదాకు కావల్సిన సీట్ల సంఖ్య 18. కానీ వైసీపీ ప్రస్తుతం 13 సీట్లలోనే ముందంజలో ఉంది. 18 దాటలేదంటే కనీసం ప్రతిపక్షంగా కూడా వైసీపీ కొనసాగలేదు. ఆ జిల్లా.. ఈ జిల్లా అని తేడా లేకుండా అన్ని జిల్లాల్లోనూ ఎన్డీఏ కూటమిదే హవా. ఇక టీడీపీ చరిత్రలోనే ఇది అతి పెద్ద విజయం. 1994లో టీడీపీ అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు దానిని కూడా బీట్ చేసింది. కాగా.. ఏపీలో తొలి ఫలితం వెలువడింది. రాజమండ్రి రూరల్ నుంచి టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి 50 వేల కోట్ల మెజారిటీతో విజయం సాధించారు.

Updated Date - Jun 04 , 2024 | 12:04 PM