Share News

TDP: తిరువూరు ఘటనపై కేసు నమోదు

ABN , Publish Date - Jan 04 , 2024 | 10:06 AM

Andhrapradesh: జిల్లాలోని తిరువూరులో నిన్న(బుధవారం) టీడీపీ కార్యాలయంలో జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. తిరువూరు సెక్టార్ 1 ఎస్సై సతీష్ ఫిర్యాదు మేరకు టీడీపీ నేతలు 36 మంది కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

TDP: తిరువూరు ఘటనపై కేసు నమోదు

ఎన్టీఆర్ జిల్లా: జిల్లాలోని తిరువూరులో నిన్న(బుధవారం) టీడీపీ కార్యాలయంలో జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. తిరువూరు సెక్టార్ 1 ఎస్సై సతీష్ ఫిర్యాదు మేరకు టీడీపీ నేతలు 36 మంది కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. టీడీపీ పార్టీ కార్యాలయంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించి.. ఎస్సై తలకు గాయాలు కావటంతో తిరువూరు సర్కిల్ సీఐ అబ్దుల్ నభీ ఆధ్వర్యంలో పూర్తి స్థాయి విచారణ చేపట్టారు. టీడీపీ కార్యాలయంలో ఉన్న సీసీ ఫుటేజ్ హార్డ్ డిస్క్‌ను స్వాధీనం చేసుకుని క్షుణ్ణంగా పరిశీలించి ఘటనకు బాధ్యులై వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.


ఇంతకీ ఏం జరిగిందంటే..

ఈ నెల 7న చంద్రబాబు సభ ఉండటంతో.. ఏర్పాట్ల కోసం తిరువూరు నియోజకవర్గ పార్టీ సర్వసభ్య సమావేశం జరగాల్సి ఉండగా ఫ్లెక్సీ వివాదం నేతల మధ్య ఘర్షణకు దారి తీసింది. టీడీపీ ఎంపీ కేశినేని నాని, కేశినేని చిన్ని (అన్నదమ్ములు) వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కేశినేని నాని ఫోటో చిన్నదిగా వేశారంటూ నాని అనుచరులు పోస్టర్లు చించి, కుర్చీలు విసిరి రభస చేశారు. ఈ క్రమంలో కేశినేని చిన్ని పార్టీ ఆఫీస్‌కు రాగా.. ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ దశలో జోక్యం చేసుకున్న పోలీసులు, ఇరు వర్గాలకు సర్ది చెప్పేందుకు ప్రయత్నాలు చేశారు. నాని, చిన్ని వర్గాల మధ్య కుర్చీలు విసురుకోడంతో ఎస్ఐ సతీష్ తలకు గాయమైంది. దీంతో ఎస్ఐ ను తీసుకుని పోలీసులు బయటకు వెళ్ళారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 04 , 2024 | 10:06 AM