Share News

Volunteers: వైసీపీ ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు

ABN , Publish Date - Mar 27 , 2024 | 01:58 PM

విశాఖ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పాల్గొంటున్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల కోడ్‌ను ఉల్లంఘించి వాలంటీర్లు అధికారపార్టీ కోసం ప్రచారంలో పాల్గొనడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. విశాఖ జిల్లా, భీమునిపట్నం మండలం, రాజుల తాళ్లవలసలో ఇటీవలే ఇద్దరు వాలంటీర్లను తొలగించారు.

Volunteers: వైసీపీ ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు

విశాఖ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) ఎన్నికల ప్రచారం (Election Campaign)లో వాలంటీర్లు (Volunteers) పాల్గొంటున్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల కోడ్‌ను ఉల్లంఘించి వాలంటీర్లు అధికారపార్టీ కోసం ప్రచారంలో పాల్గొనడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. విశాఖ జిల్లా, భీమునిపట్నం మండలం, రాజుల తాళ్లవలసలో ఇటీవలే ఇద్దరు వాలంటీర్లను తొలగించారు. అయినప్పటికీ వాలంటీర్ల తీరుమారలేదు. పద్మనాభం మండలంలో నిన్న (మంగళవారం) అవంతి శ్రీనివాసరావు (Avanti Srinivasa Rao) నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పాల్గొన్నారు. దీంతో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా పాల్గొంటున్న వాలంటీర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

కాగా వాలంటీర్లను ఎన్నికల ప్రచారంలో దూరంగా ఉంచాలంటూ ఎన్నికల సంఘం (EC) ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ కొన్ని చోట్ల వాలంటీర్లు ప్రచారంలో పాల్గొంటూనే ఉన్నారు. దీంతో ఈసీ చర్యలకు దిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో వాలంటీర్లను తొలగించింది. అయినప్పటికీ వారు మారడంలేదు. మరోవైపు నిన్న (మంగళవారం)మంత్రి విశ్వరూప్ (Minister Vishwaroop) డాక్టర్ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా, అల్లవరానికి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే అధికారులు చర్యలు తీసుకుంటారనే భయం ఉంటే.. స్వచ్ఛందంగా రాజీనామా చేసి పార్టీ విజయానికి ప్రచారం చేయాలన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని మంత్రి చెప్పడం విశేషం.

Updated Date - Mar 27 , 2024 | 02:00 PM