Share News

Operation Cambodia: ఆ ఉద్యోగం కోసం కంబోడియా వెళ్లి మోసపోయారు.. వారిని అక్కడి నుంచి ఎలా తీసుకొచ్చారంటే..?

ABN , Publish Date - May 24 , 2024 | 08:42 PM

సైబర్‌ నేరాల బారినపడి కంబోడియాలో (Cambodia) చిక్కుకున్న భారతీయులను మన ఎంబసీ అధికారులు రక్షించారు. తాజాగా మరో 60 మంది భారతీయులను కాపాడారు. దీంతో ఒక్క ఆంధ్రప్రదేశ్‌ నుంచే 150 మంది చైనా గ్యాంగ్‌ ఆధీనంలో ఉన్నట్లు గుర్తించారు.

Operation Cambodia: ఆ ఉద్యోగం కోసం కంబోడియా వెళ్లి మోసపోయారు.. వారిని అక్కడి నుంచి ఎలా తీసుకొచ్చారంటే..?
Operation Cambodia,

విశాఖపట్నం: సైబర్‌ నేరాల బారినపడి కంబోడియాలో (Cambodia) చిక్కుకున్న భారతీయులను మన ఎంబసీ అధికారులు రక్షించారు. తాజాగా మరో 60 మంది భారతీయులను కాపాడారు. దీంతో ఒక్క ఆంధ్రప్రదేశ్‌ నుంచే 150 మంది చైనా గ్యాంగ్‌ ఆధీనంలో ఉన్నట్లు గుర్తించారు. బాధితులు ఎక్కువగా శ్రీకాకుళం, విశాఖ, రాజమండ్రి నుంచి వెళ్లిన వారే ఉన్నట్లు తెలుస్తోంది. కంబోడియా అధికారులతో సన్నిహితంగా సహకరిస్తూ ఇండియన్ ఎంబసీ అధికారులు భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చారు.


ఇండియాలో సైబర్ క్రైమ్‌కు పాల్పడేలా...

ఈ విషయంపై విశాఖ పోలీస్ కమిషనర్ రవి శంకర్ అయ్యనార్ శుక్రవారం మీడియా సమావేశంలో పలు కీలక విషయాలను వెల్లడించారు. ఇండియన్ ఎంబసీ సమన్వయంతో బాధితులు విశాఖ చేరారని చెప్పారు. బాధితులు ఇంటికి చేరుకోవడానికి పోలీసు శాఖ పని చేస్తోందని తెలిపారు. డేటా ఎంట్రీ ఆపేరేటర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్షన్నర వరకు సొమ్ములు తీసుకుని కంబోడియా తీసుకుని వెళ్లారని చెప్పారు. అక్కడ వాళ్లు వీరిని చైనా వారికి అప్పగించారన్నారు. వీరి ద్వారా ఇండియాలో సైబర్ క్రైమ్‌కు పాల్పడేలా చేశారన్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం అని చెప్పి తీసుకుని వెళ్లారని తెలిపారు.

CP-Ravi-Shankar-Ayyanar.jpg


ఇండియన్లను మోసం చేస్తేనే ఆహారం ఇచ్చారన్నారు. బేస్ బాల్ బ్యాట్లతో కొట్టారన్నారు.ఎన్ఐఏలో పని చేసిన అనుభవం కేస్ దర్యాప్తునకు ఉపయోగపడిందని వివరించారు. బాధితులు ఆరు నెలలు నుంచి కంబోడియాలో ఉన్నారని చెప్పారు. మన రాష్ట్రం నుంచి 150 కు పైగా బాధితులు ఉన్నారని లెక్క తేలిందన్నారు. కంబోడియా ప్రభుత్వం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చక్కగా పని చేశాయని తెలిపారు. ఈ తరహా బాధితులు ఇంకా ఎవరైనా ఉన్నారా అని విచారణ జరుపుతున్నామని విశాఖ పోలీస్ కమిషనర్ రవి శంకర్ అయ్యనార్ పేర్కొన్నారు.

Updated Date - May 24 , 2024 | 08:42 PM