Share News

AP Politics: ఆ వైసీపీ నేత అందులో చాలా ఫేమస్.. నారా లోకేష్ హాట్ కామెంట్స్

ABN , Publish Date - Feb 17 , 2024 | 09:09 PM

సీఎం జగన్‌కు ఇంకొక్క అవకాశం ఇస్తే మన ఇళ్లను కూడా దోచేస్తారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ (Nara Lokesh) అన్నారు. శనివారం నాడు భీమిలి నియోజకవర్గంలో శంఖారావం సభ జరిగింది.

 AP Politics: ఆ వైసీపీ నేత అందులో చాలా ఫేమస్.. నారా లోకేష్ హాట్ కామెంట్స్

విశాఖపట్నం: సీఎం జగన్‌కు ఇంకొక్క అవకాశం ఇస్తే మన ఇళ్లను కూడా దోచేస్తారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ (Nara Lokesh) అన్నారు. శనివారం నాడు భీమిలి నియోజకవర్గంలో శంఖారావం సభ జరిగింది. ఈ సభలో నారా లోకేష్ ప్రసంగించారు. ఉత్తరాంధ్ర గర్జనతో తాడేపల్లి పిల్లి భయపడిందని ఎద్దేవా చేశారు. విశాఖలో సొంత ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేస్తే మన పరిస్థితి ఏంటి..? అని ప్రశ్నించారు. జగన్ షర్ట్ మడత పెడతారని అంటేనే.. తాము కుర్చీ మడత పెడతామని అన్నామని అందువల్ల వైసీపీ నేతల మనోభావాలు దెబ్బతిన్నాయని అంటున్నారని చెప్పారు. విశాఖ ఎంపీగా పక్క జిల్లా నుంచి ఒకరిని తీసుకొచ్చారని చెప్పారు. జగన్ పార్టీలో బీసీలకు న్యాయం జరగటం లేదని... దళితులు అంటే గౌరవమే లేదని.. ఆ పార్టీ నేతలే చెబుతున్నారని అన్నారు. బీసీలపై దొంగ కేసులు పెట్టీ జైలుకు పంపించారని హెచ్చరించారు. బడుగు వర్గాలు అంటే జగన్‌కు చిన్నచూపు అని చెప్పారు. తానంటే జగన్‌కు భయమని సెటైర్లు వేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తగ్గేదేలేదని సవాల్ విసిరారు.

గాలి పైన కూడా ఈ సైకో ముఖ్యమంత్రి పన్ను వేస్తారని ఆరోపించారు. విశాఖలో పెద్ద ఎత్తున, భూకబ్జాలు కుంభకోణాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ ప్రభుత్వం జీవీఎంసీనీ అవినీతిమయం చేసిందన్నారు. రూ. 500 కోట్లతో జగన్ కట్టిన ప్యాలెస్‌ను టీడీపీ అధికారంలోకి రాగానే ప్రజలకు అంకితం చేస్తామన్నారు. టైం డేట్ రాసుకోవాలని... హైదరాబాద్‌కు ధీటుగా విశాఖను తీర్చిదిద్దుతామని తెలిపారు. భీమిలికు తనకు ఒక ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. భీమిలినీ తన గుండెల్లో పెట్టుకుని అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పారు. అప్పట్లో అరగంట మంత్రిగా అవంతి శ్రీనివాస్ ఫేమస్ అయ్యారని.. ఆయన ఏమైనా జిల్లా అభివృద్ధికి పనికి వచ్చారా..? అని ప్రశ్నించారు. అవంతి చేసింది ఒకటే రాసలీలల ఫోన్ కాల్స్.... షార్ట్ విప్పి వీడియో కాల్స్ ఇవే చేశారని సెటైర్లు వేశారు. భీమిలిలో ఇప్పటి వరకు రూ.2500 కోట్ల రూపాయల భూములును దోచేశారని మండిపడ్డారు. టీడీపీ - జనసేన కూటమి మధ్య చిచ్చు పెడుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు సూపర్ 6ను ప్రతి గడపకు తీసుకువెళ్లాలని నారా లోకేష్ పిలుపునిచ్చారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 17 , 2024 | 11:01 PM