Share News

Gandi Babji: ఈ తీర్పు ప్రస్తుతం చంద్రబాబుకు రక్షణే..

ABN , Publish Date - Jan 16 , 2024 | 02:27 PM

Andhrapradesh: స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబు క్వాష్ పిటిషన్‌కు సంబంధించి సుప్రీం తీర్పుపై మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి స్పందించారు. సుప్రీంకోర్టు ధర్మాసనంలో రెండు బెంచులు వేరువేరు అభిప్రాయాలు వ్యక్తం చేశాయన్నారు.

Gandi Babji: ఈ తీర్పు ప్రస్తుతం చంద్రబాబుకు రక్షణే..

విశాఖపట్నం, జనవరి 16: స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) క్వాష్ పిటిషన్‌కు సంబంధించి సుప్రీం కోర్టు (Supreme Court) ఇచ్చిన తీర్పుపై మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి (Former MLA Gandi Babji) స్పందించారు. సుప్రీంకోర్టు ధర్మాసనంలో రెండు బెంచ్‌లు వేరువేరు అభిప్రాయాలు వ్యక్తం చేశాయన్నారు. త్రిసభ్య లేదా ఐదుగురు సభ్యుల బెంచ్‌కు బదులాయించే అవకాశం ఉంటుందని తెలిపారు. 17ఏ వర్తించదని ముందు నుంచి తాము పోరాటం చేస్తున్నామన్నారు. తీర్పు వచ్చే వరకు కూడా చంద్రబాబు నాయుడిపై ఎలాంటి ముందస్తు చర్యలు వద్దని ముందే కోర్టు చెప్పిందన్నారు. తుది తీర్పు వచ్చే వరకు ఈ తీర్పు ప్రస్తుతం చంద్రబాబు నాయుడుకు రక్షణగానే ఉంటుందని గండి బాబ్జి వెల్లడించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 16 , 2024 | 02:27 PM