Share News

Home Minister Anitha: వైసీపీ నాయకులు కూడా గంజాయి అమ్ముకుంటున్నారు: మంత్రి అనిత

ABN , Publish Date - Jun 17 , 2024 | 06:42 PM

ఏపీలో విచ్చలవిడిగా పెరిగిపోయి గంజాయి వాడకం, విక్రయాలపై హోంమంత్రి అనిత స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి విచ్చలవిడిగా పెరిగిపోయిందని, మాజీ సీఎం జగన్ గంజాయిని కట్టడి చేయడానికి కనీసం ఒక్క రివ్యూ నిర్వహించలేదని మండిపడ్డారు.

Home Minister Anitha: వైసీపీ నాయకులు కూడా గంజాయి అమ్ముకుంటున్నారు: మంత్రి అనిత

విశాఖపట్నం: ఏపీలో విచ్చలవిడిగా పెరిగిపోయి గంజాయి వాడకం, విక్రయాలపై హోంమంత్రి అనిత స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి విచ్చలవిడిగా పెరిగిపోయిందని, మాజీ సీఎం జగన్ గంజాయిని కట్టడి చేయడానికి కనీసం ఒక్క రివ్యూ నిర్వహించలేదని మండిపడ్డారు. విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తామని చెప్పిన జగన్.. గంజాయి రాజధానిగా మార్చారని విమర్శలు గుప్పించారు. వైసీపీ నాయకులు కూడా గంజాయిని అమ్ముకుంటున్నారని, ఈ రోజు (సోమవారం) నుంచి గంజాయి ఉక్కుపాదం మోపుతున్నామని హెచ్చరించారు.


గంజాయి అరికట్టడానికి టాస్క్ ఫోర్స్‌ని ఏర్పాటు చేస్తున్నామని హోంమంత్రి అనిత ప్రకటించారు. రాత్రి 8 తర్వాత చీకట్లో గుంపులు గుంపులుగా ఉన్న వారిపై పోలీసుల చర్యలు ఉంటాయని ఆమె వార్నింగ్ ఇచ్చారు. గంజాయి తీసుకున్న వారికి సంబంధించిన సమాచారం ఇస్తే పారితోషికం ప్రకటిస్తామని ప్రకటించారు. గడిచిన 5 సంవత్సరాల్లో పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని, పోలీసులకు ఏ అలవెన్స్‌లు ఇవ్వలేదని విచారం వ్యక్తం చేశారు.


రాష్ట్రంలో ఈవ్‌టీజింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత హెచ్చరించారు. జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో కనీసం పోలీస్ అకాడమీని కూడా ఏర్పాటు చెయ్యలేదని, పోలీస్ వ్యవస్థకు వచ్చిన ఫండ్స్‌ను పక్కదోవ పట్టించారని మంత్రి విమర్శించారు. తాము వైసీపీ వాళ్లపై దాడి చెయ్యాలనుకుంటే ఎప్పుడో చేసేవాళ్లమని, కానీ తాము కక్ష సాధింపు చర్యలకు పాల్పడబోమని వ్యాఖ్యానించారు. ‘‘దిశా చట్టం లేదు. దిశ పోలీస్ స్టేషన్‌ను మహిళా పోలీస్ స్టేషన్‌గా మార్చుతాం. వైసీపీ మూలాలున్న పోలీసులు తప్పుకోండి. లేదంటే పద్ధతి మార్చుకోండి. ఇది రిక్వెస్ట్ మాత్రమే. ఎవరి మీదా కక్ష సాధించబోం. మాది నాయకుడు చెప్పిందే మేము ఫాలో అవుతాం. తప్పు చేసిన వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాం’’ అంటూ హోమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు.

Updated Date - Jun 17 , 2024 | 06:42 PM