Vijayasai Reddy: మహిళను అడ్డుపెట్టుకుని కోట్ల అవినీతికి పాల్పడ్డ విజయసాయిరెడ్డి
ABN , Publish Date - Dec 19 , 2024 | 05:17 PM
ఏపీలో ఫైబర్ నెట్ కేసు విషయంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ మహిళకు ఉద్యోగం ఇప్పించి విజయసాయిరెడ్డి కోట్ల అవినీతికి పాల్పడినట్లుగా అధికారులు గుర్తించారు.
ఏపీలో ఫైబర్ నెట్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలకమైన ఫైల్స్ మాయం కావడం సంచలనం రేపింది. అందులోని కీలక సమాచారాన్ని ఓ ఫైబర్ నెట్ ఉద్యోగి విజయసాయి రెడ్డి (Vijayasai Reddy)కి అప్పగించారని ఆరోపణలు వస్తున్నాయి. ఆ ఫైల్స్ అప్పగించిన ఉద్యోగి దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ శాంతి సోదరిగా గుర్తించారు. ఈ కేసులో శాంతి సోదరిపై అనుమానాలు పెరిగాయి. వీరు దేవాదాయశాఖలో పెద్ద మొత్తంలో అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. విజయసాయి రెడ్డి ప్రణాళిక ప్రకారమే ఆమెను అడ్డు పెట్టుకుని ఫైబర్ నెట్లో కోట్ల అవినీతికి పాల్పడినట్లుగా తెలుస్తోంది.
ఇప్పటికే ఏడుగురు
దీంతో ఈ వ్యవహారంలో విజయసాయిరెడ్డి పాత్రపై దృష్టి పెట్టి అధికారులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ప్రభుత్వం మారిన వెంటనే తాజాగా శాంతి సోదరిని ఉద్యోగం నుంచి తొలగించారు. ఆ ఫైల్స్ ఎలా మాయమయ్యాయన్న విషయంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ కేసులో ఏసీబీ కోర్టు ఇప్పటికే ఏడుగురు నిందితుల ఆస్తులను అటాచ్ చేసేందుకు అనుమతి ఇచ్చింది. మొత్తం రూ. 114 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేయాలని న్యాయస్థానం సానుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఏ1 గా వేమూరి హరికృష్ణ, ఏ11 గా టెరా సాఫ్ట్ ఎండీ తుమ్మల గోపీచంద్, ప్రమీల, ఏ25గా చంద్రబాబు పేర్లు నమోదయ్యాయి.
సీఐడీ అనుమతి
వీరి కుటుంబ సభ్యుల ఆస్తులను కూడా అటాచ్ చేసేందుకు సీఐడీ అనుమతిని కోరింది. ఇదిలా ఉండగా ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుప్రీం కోర్టు డిసెంబర్ 12న విచారణ చేపట్టింది. తదుపరి విచారణను జనవరి 17, 2025న జరగనుంది. ఈ కేసుకు సంబంధించిన అంశాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబును ఇప్పటికే ఆదేశించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
Chandrababu Naidu: అమరావతి రాజధాని నిర్మాణానికి 31 వేల కోట్లు సిద్ధం
ముంబై సముద్రతీరంలో పడవ ప్రమాదం
Read Latest AP News and Telugu News