Share News

AP Assembly: ప్లకార్డ్స్ వద్దన్న పోలీసులు.. ఏపీ అసెంబ్లీ వద్ద స్వల్ప ఉద్రిక్తత

ABN , Publish Date - Feb 05 , 2024 | 10:16 AM

Andhrapradesh: మరికాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభకానున్నాయి. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యేల ఆందోళనతో అసెంబ్లీ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.

AP Assembly: ప్లకార్డ్స్ వద్దన్న పోలీసులు.. ఏపీ అసెంబ్లీ వద్ద స్వల్ప ఉద్రిక్తత

అమరావతి, ఫిబ్రవరి 5: మరికాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Session) ప్రారంభకానున్నాయి. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యేల (TDP MLAs) ఆందోళనతో అసెంబ్లీ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏపీ అసెంబ్లీ వద్ద బై బై జగన్ అంటూ తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేపట్టిన నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. ప్లకార్డ్స్ పట్టుకుని నిరసన తెలుపుతున్న టీడీపీ ఎమ్మెల్యేలను బారికేడ్లు పెట్టి మరీ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బారికేడ్లు తోసుకుంటూ ప్లకార్డులు చేత పట్టుకుని కాలినడకన అసెంబ్లీకి తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లారు. జాబ్ క్యాలెండర్ విడుదల, పోలవరం పూర్తి ఎక్కడా అంటూ తెలుగు తమ్ముళ్లు నినాదాలు చేశారు. పోలీసుల చర్యలపై తీవ్రస్థాయిలో టీడీపీ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... అసెంబ్లీకి వెళ్లే వారిని అడ్డుకోవడం దిక్కుమాలిన చర్య అని మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలను చూసి జగన్ భయపడుతున్నారని.. అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ సభ్యులను రాకుండా ఏదో విధంగా అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వానికి చివరి రోజులు దగ్గర పడ్డాయన్నారు.

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ... పనైపోయిన వైసీపీ ప్రభుత్వం గురించి ప్రత్యేకంగా మాట్లాడటానికి ఏముంటుందన్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలను చూసి జగన్ రెడ్డి భయపడుతున్నారన్నారని.. అందుకే పోలీసుల సాయంతో తమను అడ్డుకుంటున్నారన్నారు. అసెంబ్లీకి వచ్చే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డుకునే కొత్త సాంప్రదాయానికి వైసీపీ శ్రీకారం చుట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 05 , 2024 | 10:38 AM