Share News

Watch Video: ‘రా కదలిరా..’ కార్యక్రమంలో చంద్రబాబుకు తప్పిన ప్రమాదం

ABN , Publish Date - Jan 29 , 2024 | 05:14 PM

Chandrababu Narrow Escape : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రమాదం తప్పింది. రాజమండ్రిలోని కాతేరులో టీడీపీ నిర్వహించిన ‘రా కదలిరా’ కార్యక్రమంలో స్టేజీ మీద నుంచి చంద్రబాబు కిందపడబోయారు...

Watch Video: ‘రా కదలిరా..’ కార్యక్రమంలో చంద్రబాబుకు తప్పిన ప్రమాదం

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రమాదం తప్పింది. రాజమండ్రిలోని కాతేరులో టీడీపీ నిర్వహించిన ‘రా కదలిరా’ కార్యక్రమంలో స్టేజీ మీద నుంచి చంద్రబాబు కిందపడబోయారు. సభకు భారీగా జనం రావడంతో.. ప్రజలను నియంత్రించడంలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. మరోవైపు.. చంద్రబాబును కలిసేందుకు టీడీపీ, జనసేన నేతలు పోటీపడ్డారు. ఈ క్రమంలో స్టేజీపై తోపులాట జరగడంతో టీడీపీ అధినేత కిందపడబోయారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే చంద్రబాబును పట్టుకున్నారు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ ఘటనపై టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూసుకోవాలని భద్రతా సిబ్బంది, నిర్వాహకులను కార్యకర్తలు కోరుతున్నారు.

Updated Date - Jan 29 , 2024 | 05:30 PM