Share News

TDP - AP Politics: ఢిల్లీ నుంచి పార్టీ సీనియర్లకు ఫోన్ చేసిన చంద్రబాబు.. ముఖ్యనేతలకు ఫోన్లు చేసి...

ABN , Publish Date - Mar 08 , 2024 | 05:41 PM

బీజేపీతో (BJP) పొత్తు కోసం ఆ పార్టీ పెద్దలతో టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ చర్చలు కీలక దశకు చేరుకున్నాయని, సీట్ల కేటాయింపుపై మాట్లాడుకుంటున్నారని తెలుస్తోంది. ఒకవైపు పొత్తుపై చర్చిస్తూనే మరోవైపు ఏపీలో రాజకీయ పరిణామాలు, పరిస్థితులపై చంద్రబాబు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేతలు, టికెట్ ఆశావహకులతో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. పార్టీ నేతలు, వివిధ నియోజకవర్గాల ఇంచార్జ్‌లతో చంద్రబాబు వరుసగా మాట్లాడుతున్నారు. తొలి విడత అభ్యర్థుల సీట్ల ప్రకటన అనంతరం ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితులపై అభ్యర్థులతో చంద్రబాబు నేరుగా చర్చిస్తున్నారు.

TDP - AP Politics: ఢిల్లీ నుంచి పార్టీ సీనియర్లకు ఫోన్ చేసిన చంద్రబాబు.. ముఖ్యనేతలకు ఫోన్లు చేసి...

అమరావతి: బీజేపీతో (BJP) పొత్తు కోసం ఆ పార్టీ పెద్దలతో టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ చర్చలు కీలక దశకు చేరుకున్నాయని, సీట్ల కేటాయింపుపై మాట్లాడుకుంటున్నారని తెలుస్తోంది. ఒకవైపు పొత్తుపై చర్చిస్తూనే మరోవైపు ఏపీలో రాజకీయ పరిణామాలు, పరిస్థితులపై చంద్రబాబు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేతలు, టికెట్ ఆశావహకులతో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు.

పార్టీ నేతలు, వివిధ నియోజకవర్గాల ఇంచార్జ్‌లతో చంద్రబాబు వరుసగా మాట్లాడుతున్నారు. తొలి విడత అభ్యర్థుల సీట్ల ప్రకటన అనంతరం ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితులపై అభ్యర్థులతో చంద్రబాబు నేరుగా చర్చిస్తున్నారు. విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయాలను అర్థం చేసుకుని కలిసి పనిచేయాలని నాయకులకు చంద్రబాబు సూచిస్తున్నారు. 12 నియోజకవర్గాలకు చెందిన నేతలతో చంద్రబాబు స్వయంగా మాట్లాడి ఎన్నికలకు సిద్దం కావాలని సూచనలు చేశారు. యర్రగొండపాలెంకు చెందిన పార్టీ నేతలు మన్నె రవీంద్ర, ఎరిక్సన్‌లతో చంద్రబాబు మాట్లాడారు. ఇద్దరు నేతలు కలిసి పనిచేయాలని సూచన చేశారు. ఇక పార్వతీపురం నియోజకవర్గానికి చెందిన విజయ్, మాజీ ఎమ్మెల్సీ జగదీశ్‌లు కలిసి పనిచేయాలని చంద్రబాబు కోరారు. పార్వతీపురంలో విజయ్‌ను గెలిపించేందుకు కృషి చెయ్యాలని జగదీశ్‌కు సర్ది చెప్పారు.

ఇక నంద్యాల నియోజకవర్గంలో భూమా బ్రహ్మానంద రెడ్డి, సీనియర్ నేత ఫరూక్‌లతో చంద్రబాబు మాట్లాడారు. ఫరూక్‌కు సహకరించాలని బ్రహ్మానంద రెడ్డికి టీడీపీ అధిపతి సూచన చేశారు. కళ్యాణ దుర్గంలో సీటు దక్కించుకున్న సురేంద్ర బాబుకు పూర్తి సహకారం అందించాలని ఉమా మహేశ్వర నాయుడు, హనుమంత రాయ చౌదరీలను చంద్రబాబు కోరారు. మరోవైపు కురుపాం నేత దత్తి లక్ష్మణ రావుతో కూడా చంద్రబాబు మాట్లాడారు. పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థి తోయక జగదీశ్వరి గెలుపుకు కృషి చేయాలని సూచన చేశారు.

చిత్తూరు జిల్లాకు చెందిన నేత, మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్‌తో కూడా చంద్రబాబు మాట్లాడారు. పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. ఉంగుటూరు ఇంచార్జ్ గన్ని వీరాంజనేయులు, పిఠాపురం నేత వర్మ, పోలవరం టీడీపీ నేత బొరగం శ్రీనివాస్, నర్సాపురం నేత పొత్తూరి రామరాజు, కాకినాడ రూరల్‌లో పిల్లి సత్యనారాయణ మూర్తి, తాడేపల్లిగూడెం నేత వలవల బాబ్జీ‌లతో కూడా ఆయన మాట్లాడారు. పొత్తులో భాగంగా ఆయా నియోజకవర్గాల్లో ఎవరికి సీటు వచ్చినా గెలిపించేందుకు పనిచేయాలని సూచన చేశారు. సీటు దక్కని ప్రతి ఒక్కరికి పార్టీ న్యాయం చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. స్వయంగా చంద్రబాబు మాట్లాడడంతో పార్టీ కోసం పనిచేస్తామంటూ ఆయన నేతలు తమ అంగీకారాన్ని తెలిపారు.

ఇవి కూడా చదవండి

AP Politics: 2017లో జరిగిన విషయాన్ని బయటపెట్టిన ఎన్నికల వ్యూహకర్త పీకే!.. వైసీపీ నేతలు అంత తహతహలాడారా?

AP Politics: చిత్తూరు వైసీపీ అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి గురజాల జగన్ మోహన్ ఘాటు వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 08 , 2024 | 05:45 PM