Chandrababu: తెలుగు డీడీలో వార్తలనగానే మొదట గుర్తొచ్చేది శాంతి స్వరూప్..
ABN , Publish Date - Apr 05 , 2024 | 12:31 PM
Andhrapradesh: తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ (Shanti Swaroop) మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. తొలి తెలుగు న్యూస్ రీడర్, యాంకర్, రచయిత శాంతి స్వరూప్ మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా శాంతిస్వరూప్ మృతిపై టీడీపీ చీప్ సంతాపం ప్రకటించారు. తెలుగు దూరదర్శన్‌లో వార్తలు అనగానే మొదటగా గుర్తొచ్చేది శాంతి స్వరూప్ అని అన్నారు.
అమరావతి, ఏప్రిల్ 5: తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ (Shanti Swaroop) మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) సంతాపం తెలిపారు. తొలి తెలుగు న్యూస్ రీడర్, యాంకర్, రచయిత శాంతి స్వరూప్ మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా శాంతిస్వరూప్ మృతిపై టీడీపీ చీఫ్ సంతాపం ప్రకటించారు. ‘‘తెలుగు దూరదర్శన్‌లో వార్తలు అనగానే మొదటగా గుర్తొచ్చేది శాంతి స్వరూప్. నేను ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మేమిద్దరం కలిసి ‘‘ప్రజలతో ముఖ్యమంత్రి’’ అనే కార్యక్రమాన్ని ప్రతి సోమవారం చేసేవాళ్ళం. ఆరు సంవత్సరాల పాటు సాగిన ఈ కార్యక్రమంలో ప్రజలు నేరుగా తమ సమస్యలను చెప్పుకుని పరిష్కారం పొందేవారు. ఈ విధంగా మా అనుబంధం సుదీర్ఘమైనది. శాంతి స్వరూప్ ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ... ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి’’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
YS Sharmila: షర్మిల పాదయాత్రకు వైసీపీ నాయకురాలు.. మరికాసేపట్లో కాంగ్రెస్‌లోకి..
కాగా.. ప్రముఖ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూశారు. గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రెండురోజుల క్రితం ఆయనకు గుండెపోటు వచ్చింది. దాంతో కుటుంబ సభ్యులు ఆయన్ను యశోదా ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు ఆయనకు చికిత్సనందించారు. దురదృష్టావశాత్తు చికిత్స పొందుతూనే ఆయన కన్నుమూశారు.
ఇవి కూడా చదవండి...
Hyd to Goa: కేవలం రూ.425తోనే గోవా ట్రిప్.. ఇది మీకు తెలుసా?
Congress: ప్రతి మహిళకు ఏడాదికి రూ.లక్ష.. కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీల వరాలు..
మరిన్ని ఏపీ వార్తల కోసం..