Share News

CM YS Jagan: ఏపీ సీఎం జగన్, ఫ్యామిలీకి ఎస్ఎస్‌జీ భద్రత

ABN , Publish Date - Jan 25 , 2024 | 07:19 AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యుల భద్రత కోసం తీసుకొచ్చిన ఏపీ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ (ఎస్ఎస్‌జీ) చట్టం 2023 అమల్లోకి వచ్చింది. సీఎం జగన్‌ భద్రతా వ్యవహారాలను సెక్యూరిటీ వింగ్ చూస్తుంటుంది. ఇకపై ఎస్ఎస్‌జీ సిబ్బంది కూడా భద్రతా చర్యల్లో పాల్గొంటారు.

 CM YS Jagan: ఏపీ సీఎం జగన్, ఫ్యామిలీకి ఎస్ఎస్‌జీ భద్రత

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan), ఆయన కుటుంబ సభ్యుల భద్రత కోసం తీసుకొచ్చిన ఏపీ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ (ఎస్ఎస్‌జీ) చట్టం 2023 అమల్లోకి వచ్చింది. సీఎం జగన్‌ భద్రతా వ్యవహారాలను సెక్యూరిటీ వింగ్ చూస్తుంటుంది. ఇకపై ఎస్ఎస్‌జీ సిబ్బంది కూడా భద్రతా చర్యల్లో పాల్గొంటారు. గత అసెంబ్లీ సమావేశాల్లో ఎస్ఎస్‌జీ చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఆ సెషన్‌లో ఏపీ అసెంబ్లీ ఆమోదం పొందింది. ఆ చట్టాన్ని బుధవారం నాడు గవర్నర్ ఆమోదం తెలిపారు. వెంటనే ఎస్ఎస్‌జీ చట్టం అమల్లోకి వచ్చిందని హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం జగన్, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ భద్రత కోసం ఎస్ఎస్‌జీ సిబ్బంది పాల్గొంటారు. రాష్ట్రంలో ఉన్నప్పుడు, విదేశాలకు వెళ్లిన సమయంలో ఎస్ఎస్‌జీ సిబ్బంది విధుల్లో ఉంటారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 25 , 2024 | 07:31 AM