Share News

AP NEWS: నీతి అయోగ్ స్ఫూర్తితో ఏపీకి ఆ చట్టాన్ని తీసుకొచ్చాం: మంత్రి ధర్మాన ప్రసాద్ రావు

ABN , Publish Date - Feb 03 , 2024 | 03:28 PM

నీతి అయోగ్ చూపించిన మోడల్ ప్రకారం ల్యాండ్ టైటలింగ్ యాక్ట్‌ను ఏపీకి తీసుకొచ్చామని మంత్రి ధర్మాన ప్రసాద్ రావు(Minister Dharmana Prasad Rao) తెలిపారు. వంశధార సూపరింటిండెంట్ ఇంజనీరు కార్యాలయంలో స్వర్గీయ బొడ్డేపల్లి రాజగోపాలరావు విగ్రహాన్ని శనివారం నాడు ఆవిష్కరించారు.

AP NEWS: నీతి అయోగ్ స్ఫూర్తితో ఏపీకి ఆ చట్టాన్ని తీసుకొచ్చాం: మంత్రి ధర్మాన ప్రసాద్ రావు

శ్రీకాకుళం జిల్లా: నీతి అయోగ్ చూపించిన మోడల్ ప్రకారం ల్యాండ్ టైటలింగ్ యాక్ట్‌ను ఏపీకి తీసుకొచ్చామని మంత్రి ధర్మాన ప్రసాద్ రావు(Minister Dharmana Prasad Rao) తెలిపారు. వంశధార సూపరింటిండెంట్ ఇంజనీరు కార్యాలయంలో స్వర్గీయ బొడ్డేపల్లి రాజగోపాలరావు విగ్రహాన్ని శనివారం నాడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మన మీడియాతో మాట్లాడుతూ... 2.5 లక్షల ఎకరాలకు బొడ్డేపల్లి రాజగోపాలరావు వంశధార ప్రాజెక్ట్ నీరందిస్తుందని తెలిపారు. వంశధార ఫేజ్2 కూడా దాదాపు పూర్తి అయిందన్నారు. ఒరిస్సాతో ఏపీకి ఓ వివాదం ఉండడంతో సీఎం జగన్.. ఒరిస్సా ముఖ్యమంత్రితో చర్చించారని తెలిపారు. కానీ ఒరిస్సా మరలా సుప్రీం కోర్టు‌కు వెళ్లిందన్నారు.

ల్యాండ్ టైటలింగ్ యాక్ట్‌పై కేంద్రప్రభుత్వం కొన్ని సూచనలు చేసిందన్నారు. 170 దేశాల్లో ఈ టైటలింగ్ యాక్ట్ ఉందని.. ఇంకా చట్టం అమలు చేయలేదు.. ఏపీలో కొన్ని మార్పులు చేయాల్సి ఉందన్నారు. న్యాయవాదులకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని... వారిని తప్పుబట్టడం లేదన్నారు. సర్వే పూర్తి చేసిన తర్వాతే.. చట్టాన్ని పూర్తి స్థాయిలో ఏపీలో అమలు చేస్తామని చెప్పారు. న్యాయవాదుల సలహాలు, సూచనలు అన్ని తీసుకుంటామని అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యాక్ట్‌ను అమలు చేయాలని కేంద్రం వత్తిడి తెస్తుందన్నారు. ఏపీ తెచ్చిన ఈ చట్టం సైతం ఇతర రాష్ట్రాలు పరిశీలిస్తున్నాయని అన్నారు. ఈ అంశంపై న్యాయవాదులతో చర్చిస్తున్నట్లు తెలిపారు.పేదల ఆస్తులను కాపాడటం కోసమే ఈ టైటలింగ్ యాక్ట్ తీసుకొచ్చామని మంత్రి ధర్మాన ప్రసాద్ రావు పేర్కొన్నారు.

ఆ హత్య వెనుక ఎవరు ఉన్నా విడిచిపెట్టం

రాష్ట్రంలో లక్షల మందికి ఇంటి పట్టాలు ఇచ్చామని... వీరందరికీ రిజిస్ట్రేషన్ చేయించాలని సంకల్పంతో ఉన్నామని మంత్రి ధర్మాన ప్రసాద్ రావు తెలిపారు. ప్రజలు సచివాలయానికి వెళ్తే చాలని రిజిస్ట్రేషన్ బాధ్యతలు తామే తీసుకుంటామని అన్నారు. రిజిస్ట్రేషన్‌కు రూపాయి కూడా చెల్లించనవసరం లేదన్నారు. ఎమ్మార్వో హత్య కేసును త్వరగా పరిష్కరించాలని విశాఖపట్నం పోలీస్ కమిషనర్‌ను ఆదేశించినట్లు తెలిపారు. ఈ కేసును మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని..ఎమ్మార్వో హత్య వెనుక నిందితులు ఎంతటి వారైనా సరే విడిచిపెట్టమని మంత్రి ధర్మాన ప్రసాద్ రావు హెచ్చరించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 03 , 2024 | 03:37 PM