Rajashyamala Yagam: చంద్రబాబు నివాసంలో రాజశ్యామల యాగం
ABN , Publish Date - Feb 16 , 2024 | 01:28 PM
Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో శుక్రవారం రాజశ్యామల యాగం చేపట్టారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ యాగం జరుగనుంది. ఇందులో భాగంగా మొదటి రోజు జరిగిన పూజా కార్యక్రమాలు, యాగ క్రతువులో చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి పాల్గొన్నారు.
అమరావతి, ఫిబ్రవరి 16: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu naidu) నివాసంలో శుక్రవారం రాజశ్యామల యాగం చేపట్టారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ యాగం జరుగనుంది. ఇందులో భాగంగా మొదటి రోజు జరిగిన పూజా కార్యక్రమాలు, యాగ క్రతువులో చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి పాల్గొన్నారు. 50 మంది రిత్వికులు యాగ నిర్వహణలో పాల్గొన్నారు. రాజశ్యామల యాగంలో భాగంగా మూడు రోజుల పాటు పలు రకాల పూజలు, క్రతువులు నిర్వహించనున్నారు. ఆదివారం పూర్ణాహుతితో యాగం ముగియనుంది. చంద్రబాబు కొద్దిరోజుల క్రితం శత చండి యాగం, మహా సుదర్శన హోమం చేపట్టిన విషయం తెలిసిందే.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...