Share News

CPM.. బీజేపీకి మద్దతు ఇచ్చే పార్టీలతో పొత్తు ఉండదు: శ్రీనివాసరావు

ABN , Publish Date - Jan 16 , 2024 | 01:04 PM

ప్రకాశం: బీజేపీకి మద్దతు ఇచ్చే పార్టీలతో మాకు పొత్తు ఉండదని, దేశ వ్యాప్తంగా మత విధ్వేషాలు రెచ్చగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు అన్నారు.

CPM.. బీజేపీకి మద్దతు ఇచ్చే పార్టీలతో పొత్తు ఉండదు: శ్రీనివాసరావు

ప్రకాశం: బీజేపీకి మద్దతు ఇచ్చే పార్టీలతో మాకు పొత్తు ఉండదని, దేశ వ్యాప్తంగా మత విధ్వేషాలు రెచ్చగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఆయన ప్రకాశంలో మీడియాతో మాట్లాడుతూ మతం పేరుతో దేశాన్ని ఛీల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఇతర పార్టీలతో సంప్రదింపులు జరిపి పొత్తులపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

36 రోజులుగా అంగన్‌వాడీల సమ్మె కొనసాగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో విమర్శించారు. అంగన్‌వాడీ సిబ్బంది పట్ల ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తిస్తోందని ఆరోపించారు. 2023లో మూడు నెలల పాటూ పాలు, గుడ్లు ప్రభుత్వం సరఫరా చేయలేదని, ఆ రోజు ప్రభుత్వానికి ఎస్మా గుర్తుకు రాలేదా?... ప్రభుత్వంపై ఎస్మా పెట్టాలి కదా అని అన్నారు. తెలంగాణా కంటే ఎక్కువ జీతం ఇస్తానని చెప్పి సీఎం జగన్ మాట తప్పారన్నారు. భూరక్ష చట్టం రైతులకు, పేద మధ్య తరగతి ప్రజలకు తీవ్ర నష్టం కలిగిస్తోందన్నారు. భూరక్ష చట్టంపై న్యాయవాదులు చేస్తున్న ఆందోళనకు సీపీఎం మద్దతు ఉంటుందని శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

Updated Date - Jan 16 , 2024 | 01:04 PM