Share News

YCP: ప్రకాశం జిల్లాలో వైసీపీకి షాక్

ABN , Publish Date - Feb 28 , 2024 | 09:51 AM

ప్రకాశం: జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజీనామా చేయనున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం ఆయన ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ మాగుంట కుటుంబానికి ప్రకాశం జిల్లా రాజకీయ జన్మనిచ్చిందన్నారు.

YCP:  ప్రకాశం జిల్లాలో వైసీపీకి షాక్

ప్రకాశం: జిల్లాలో వైసీపీ (YCP)కి షాక్ (Shock) తగిలింది. ఆ పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి (Magunta Srinivasulu Reddy) రాజీనామా చేయనున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం ఆయన ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ మాగుంట కుటుంబానికి ప్రకాశం జిల్లా రాజకీయ జన్మనిచ్చిందన్నారు. మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాకు వచ్చి 33 సంవత్సరాలు గడిచాయన్నారు. 8 సార్లు పార్లమెంట్, 2 సార్లు అసెంబ్లీ, ఒకసారి ఎమ్మెల్సీకి పోటీ చేశామని, మాగుంట కుటుంబానికి అహం లేదు.. ఆత్మగౌరవం ఉందని.. గౌరవాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నామన్నారు. రాబోయే ఎన్నికల్లో తన కుమారుడు రాఘవరెడ్డి పోటీ చేస్తాడని ఆయన ప్రకటించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల వైసీపీని వీడుతున్నామన్నారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. తనకు జగన్మోహన్ రెడ్డి (CM Jagan) సహాయసహకారాలు అందించారని.. ఈ సందర్బంగా ఆయనకు కృతజ్ఞతలు తెలిజేస్తున్నానని మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు.

వైసీపీ అధిష్టానం ఒంగోలులో మాగుంటని దూరంపెట్టింది. ఒంగోలు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సీఎం జగన్ తెరపైకి తెచ్చారు. వైసీపీలో పరిణామాలపై మాగుంట శ్రీనివాసులు రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఈ రోజు ఆయన మీడియా సమావేశంలో ప్రకటించారు. మార్చి మొదటి వారంలో మాగుంట టీడీపీలో చేరనున్నట్లు సమాచారం.

Updated Date - Feb 28 , 2024 | 09:58 AM