Share News

Balineni Srinivas: కావాల్సిన సీట్ల కోసం రాజీనామా చేయడం ఎంత సేపు.. బాలినేని కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Jan 24 , 2024 | 04:30 PM

Andhrapradesh: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి టికెట్ ఇప్పించేందుకు ఇంకా ప్రయత్నిస్తున్నానని తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... మాగుంట శ్రీనివాసులురెడ్డి 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారని.. తన ప్రయత్నం ఎంత వరకు ఫలిస్తుందో వేచి చూడాలన్నారు.

Balineni Srinivas: కావాల్సిన సీట్ల కోసం రాజీనామా చేయడం ఎంత సేపు.. బాలినేని కీలక వ్యాఖ్యలు

ప్రకాశం, జనవరి 24: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (Former Minister Balineni Srinivasreddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి (MP Magunta Srinivasulu Reddy) టికెట్ ఇప్పించేందుకు ఇంకా ప్రయత్నిస్తున్నానని తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... మాగుంట శ్రీనివాసులురెడ్డి 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారని.. తన ప్రయత్నం ఎంత వరకు ఫలిస్తుందో వేచి చూడాలన్నారు. సంతనూతలపాడు, కొండపిలో తాను చెప్పిన వారికి టికెట్ ఇవ్వలేదని వాపోయారు. అయినా కావాల్సిన సీట్ల కోసం రాజీనామా చేయడం ఎంత సేపు పట్టదని సంచలన కామెంట్స్ చేశారు. అయినా అన్నీ సామరస్యంగా జరుగుతాయన్నారు. ఎర్రగొండపాలెంలో అభ్యర్థికి మంత్రి సురేష్ మద్దతు ఇస్తారన్నారు. అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు గెలుస్తారని బాలినేని శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అయితే బాలినేని చేసిన వ్యాఖ్యలు వైసీపీలో మరోసారి కలకలం రేపినట్లైంది.


గత కొద్దిరోజులుగా ఒంగోలు సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి టికెట్ కోసం బాలినేని విశ్వప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సీఎం జగన్ (CM Jagan) మాత్రం మాగుంట రెడ్డిని పక్కన పెట్టేసినట్లు సమాచారం. అయితే మాగుంట వైసీపీ నుంచి పోటీ చేయకపోతే.. ఒంగోలు అసెంబ్లీ నుంచి పోటీ చేసే తనకు కూడా ఇబ్బంది అవుతుందని భావించిన బాలినేని.. మాగుంటకు టికెట్‌ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో మాగుంటకు ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ టికెట్ కేటాయించేది లేదని జగన్ చెప్పినట్లు పార్టీ వర్గాల సమాచారం. దీంతో పాటు ప్రకాశం జిల్లాలోని కొన్ని అసెంబ్లీ నియోజక వర్గాల్లో తన అనుచరులకు టికెట్లు ఇప్పించాలని బాలినేని ప్రయత్నాలు చేశారు. అవి కూడా బెడిసికొట్టినట్లైంది. బాలినేనికి సంబంధం లేకుండానే కొన్ని సీట్లకు సంబంధించి ఇప్పటికే ప్రకటన కూడా వెలువడింది. ఈ క్రమంలో కావాల్సిన సీట్ల కోసం రాజీనామా చేయడం ఎంత సేపు అంటూ తాజాగా బాలినేని శ్రీనివాస రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైసీపీలో కాక రేపుతున్నాయి.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 24 , 2024 | 04:59 PM