Share News

Pawan Kalyan: మా అన్న చిరంజీవి జోలికొస్తే తాట తీస్తా.. పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్

ABN , Publish Date - Apr 21 , 2024 | 08:26 PM

పస్తులు లేని ఏపీని నిర్మించడమే తన లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. తనకు నరసాపురం, మొగల్తూరు రెండు తీపి జ్ఞాపకాలని అన్నారు. ఆదివారం నాడు నరసాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు.

 Pawan Kalyan: మా అన్న చిరంజీవి జోలికొస్తే తాట తీస్తా..  పవన్ కళ్యాణ్  స్ట్రాంగ్ వార్నింగ్

పశ్చిమగోదావరి: పస్తులు లేని ఏపీని నిర్మించడమే తన లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. తనకు నరసాపురం, మొగల్తూరు రెండు తీపి జ్ఞాపకాలని అన్నారు. ఆదివారం నాడు నరసాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. దశాబ్దం పాటు చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని జనసేన ఎదిగిందని తెలిపారు. డబ్బు బలుపు, అహంకారంతో వైసీపీ ఎదిగిందని మండిపడ్డారు. అలాంటి పార్టీని ఎదుర్కోవాలంటే ఎంత సత్తా కావాలని ప్రశ్నించారు.


Chandrababu: ప్రచారానికి ఇంకా 20 రోజులే... చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

సగటు మనిషిని తానని.. దశాబ్దకాలం పాటు దెబ్బలు తిన్నానని చెప్పారు. దానికి కారణం చెక్కు చెదరని మీ ప్రేమ, అభిమానమేనని అన్నారు. మీ బంగారు భవిష్యత్తు కోసం తాను అండగా నిలబడ్డానని చెప్పారు. తన మీద కేసులే లేవని.. జగన్ లాగా 32 కేసులు అసలే లేవని అన్నారు.

5 కోట్ల ఆంధ్ర ప్రజల భవిష్యత్తు కోసం నిలబడాలని బీజేపీ కేంద్ర నాయకులను అడిగితే తనతో కలిసి వచ్చారని అన్నారు. జనసేన- తెలుగుదేశం - బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. సంక్షేమ పథకాల్లో ఎలాంటి కోత ఉండదని మాటిచ్చారు. ఎన్డీఏ కూటమికి ఈ ఎన్నికల్లో ఓటు వేయాలని కోరారు.


Taraka Ratna: ఎన్నికల వేళ.. అలేఖ్య రెడ్డి ట్విట్ వైరల్

వెర్రికొర్రి వేషాలు వేయొద్దు...

‘‘జగన్ పేపర్లు లీక్ చేస్తుంటే, తాను చెగువీరా గురించి చదివాను. నన్ను బూతులు తిట్టిస్తారు. నేను చాలా తెగించిన వాడిని. నేను తలుచుకుంటే జగన్ తట్టుకోలేవ్ జాగ్రత్త. నేను ఓటు బ్యాంకు రాజకీయాలు చేయను. జగన్ గొడుగు కిందకు ఎవరైనా వెళ్తే అందరూ రౌడీలుగా మారతారు. నేను బయటకు రాగానే జగన్ కాపలా కుక్కలు తిడుతున్నాయి. వారికి డబ్బులు, అధికారం, అహంకారం ఎక్కువైంది. సూపర్ స్టార్ రజనీకాంత్ ఏపీకి వచ్చి టీడీపీ అధినేత చంద్రబాబుని మెచ్చుకుంటే, ఆయనను సజ్జల రామకృష్ణారెడ్డి తిడతారు. మీరు గుంట నక్కల సమూహంలా ఉన్నారు.. మీరు సింహాలా.. సింహం ఎలా వస్తుందో తెలుసా. సజ్జల పులివెందుల నుంచి వచ్చారో, ఫ్యాక్షన్ నేపథ్యం నుంచి వచ్చారో తెలీదు. కానీ ఒక విప్లవ కారుడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను. వైసీపీ గుండా బ్యాచ్‌లు, రౌడీ మూకలను హెచ్చరిస్తున్నా. ఎన్నికల సమయంలో వెర్రికొర్రి వేషాలు వేస్తే తాట తీస్తా. నా మీద సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసినా సహించను’’ అని పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.


చిరంజీవిని బెదిరిస్తున్నారు..

‘‘మా అన్న చిరంజీవిని సజ్జల ఏమైనా అంటే సహించేది లేదు. ఆయన అజాత శత్రువు. ఆయన జోలికి గానీ, శెట్టిబలిజ, కాపు సామాజిక వర్గం జోలికి వస్తే చూస్తూ ఊరుకోను.. సజ్జల నీకు నా సంగతి తెలీదు.. ఇప్పటి వరకు బూతుల అసెంబ్లీ చూశారు. ఇంట్లో నుంచి బయటకు రాని ఆడబిడ్డలను సైతం తిట్టిన బ్యాచ్ మీది. చిరంజీవిని బెదిరిస్తున్నారు.. ఆయన ఒక మాజీ మంత్రి. ఆయనను బెదిరిస్తే చూస్తూ ఊరుకోను. మీరు నోరు జారండి, తప్పు చేయండి.. మిమ్మల్ని రోడ్డు మీద మోకాళ్ల మీద నడిపిస్తా. ఏమనుకుంటున్నావు.. జగన్ నీ గురించి.. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు. మీరు కలుగుల్లో పందికొక్కులు..ఎలుకల సమూహం.. మీరు సింహాలు కాదు’’ అని పవన్ కళ్యాణ్ సెటైర్లు గుప్పించారు.


TDP: చంద్రబాబు నివాసానికి వచ్చిన గిడ్డి ఈశ్వరి, ఎంఎస్ రాజు, రఘురామ..

అన్న క్యాంటీన్లను నిర్వహిస్తాం...

పోలవరం ప్రాజెక్టును వీలైనంత త్వరగా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. పేదల కడుపు నింపడానికి అన్న క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు భారీ ఎత్తులో నిర్వహిస్తామని మాటిచ్చారు. నరసాపురం, కోససీమ వశిష్ట వారధి నిర్మిస్తామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

వశిష్ట వారధి నిర్మించకుండా ఓట్లు అడగనని జగన్ అన్నారని.. ఇప్పుడు మాట తప్పారని మండిపడ్డారు. లేసు పరిశ్రమకు పూర్వ వైభవం కల్పించి, మహిళలకు ఆదాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అక్వా రైతులను జగన్ ముంచేశారని ధ్వజమత్తారు. అక్వా పరిశ్రమను గోదావరి జిల్లాల్లో సమూలంగా ముంచేశారని పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు.


AP Elections: వైసీపీ ఆశలు ఆవిరి.. ఆ నియోజకవర్గంలో వ్యూహం మార్చిన బీజేపీ..

ఆ జీవోను రద్దు చేస్తా...

అక్వా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదన్నారు. గుజరాత్ తర్వాత ఎక్కువ సముద్ర తీరం ఏపీలోనే ఉందని తెలిపారు. మత్స్యకార సామాజిక వర్గాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

పలుమార్లు మత్స్యకారులు అంతర్జాతీయ జలాల్లోకి వెళ్తే కేంద్రంతో మాట్లాడి సమస్య పరిష్కరించానని గుర్తుచేశారు. మత్స్యకారులకు సంబంధించిన 217 జీవోను రద్దు చేస్తామని పవన్ కళ్యాణ్ మాటిచ్చారు.


ఆ కేసులను ఎత్తివేస్తాం...

జగన్ ప్యాలస్‌ల మీద ప్యాలస్‌లు కడుతున్నారని దుయ్యబట్టారు. మత్స్యకారులకు మాత్రం జెట్టీలు, హార్బర్లు మాత్రం కట్టడం లేదన్నారు. మత్స్యకారులకు ఏ ప్రమాదం జరిగినా రూ. 10 లక్షలు బీమా చెల్లిస్తామని హామీ ఇచ్చారు.

మత్స్యకారులపై పెట్టిన ఎక్సైజ్ కేసులను అధికారంలోకి రాగానే ఎత్తివేస్తామన్నారు. జగన్ ఈ మధ్య సభల్లో చాలా ఎక్కువ మాట్లాడారని అన్నారు. ఒక కులాన్ని నమ్ముకుంటే వ్యాపారాలు చేయలేరని చెప్పారు. కానీ జగన్ కాపులను టార్గెట్ చేస్తూ, తనను వారితో తిట్టిస్తారని పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


AP Election 2024: పోస్టల్ బ్యాలెట్లపై ఎన్నికల సంఘానికి బీజేపీ నేత లేఖ

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 21 , 2024 | 08:48 PM