Janasena: పొత్తు కోసం ఎన్నో తిట్లు తిన్నాను.. రాష్ట్రం కోసం నానా మాటలు పడ్డాను: పవన్ కళ్యాణ్
ABN , Publish Date - Feb 21 , 2024 | 05:29 PM
రాష్ట్రాన్ని కాపాడుకునేందుకే జనసేన ఇతర పార్టీలతో పొత్తు కుదుర్చుకుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) స్పష్టం చేశారు. టీడీపీ - జనసేనతోపాటు బీజేపీతో పొత్తు కుదుర్చుకునేందుకు తాను ఎన్నో అవమానాలు ఎదుర్కున్నానని పవన్ వ్యాఖ్యానించారు.
ప.గో: రాష్ట్రాన్ని కాపాడుకునేందుకే జనసేన ఇతర పార్టీలతో పొత్తు కుదుర్చుకుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) స్పష్టం చేశారు. టీడీపీ - జనసేనతోపాటు బీజేపీతో పొత్తు కుదుర్చుకునేందుకు తాను ఎన్నో అవమానాలు ఎదుర్కున్నానని పవన్ వ్యాఖ్యానించారు.
"ఎన్నికల్లో ప్రతిపక్ష ఓటు చీలితే సీఎం జగన్ లాభపడతారు. ఇది జరగకుండా ఉండేందుకే పొత్తుకు నిర్ణయించాం. అయితే అది అంత సులభంగా జరగలేదు. పొత్తు కోసం వెళ్లిన నేను జాతీయ నాయకత్వంతో ఎన్ని తిట్లు తిన్నానో నాకు తెలుసు. వాళ్లను ఒప్పించడానికి చాలా కష్టపడ్డాను. అనేక అవమానాలకు గురయ్యాను. స్వలాభం కోసం పొత్తును ఆశించలేదు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎంత దూరమైన వెళ్తాను. అందుకే తిట్టినా భరించాను. టీడీపీ(TDP), జనసేన, బీజేపీ(BJP) కలిసి ఉండాలని కోరుకుంటున్నా" అని పవన్ వెల్లడించారు.
అభివృద్ధి చేసి బటన్ నొక్కాలి..
సీఎం జగన్ అప్పులు చేసి బటన్ నొక్కి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి బటన్ నొక్కాలని జనసేనాని డిమాండ్ చేశారు.
"టీడీపీ - జనసేన కూటమి అధికారంలోకి రాగానే అభివృద్ధి చేస్తూ.. సంక్షేమాన్ని కొనసాగిస్తుంది. మాపై వైసీపీ దుష్ర్పచారం చేస్తోంది. కొందరికి భయపడే వ్యక్తిత్వం నాది కాదు. ప్రజారాజ్యం పార్టీకి 18 సీట్లొచ్చినా నిలబెట్టుకోలేకపోయాం. జనసేనకు సీట్లు రాకపోయినా ఏళ్లుగా నిలబెట్టుకుంటూ వస్తున్నాం. నేను గాజువాకతో పాటు మరోచోట పోటీ చేయాలని అనుకుంటున్నాను. భీమవరంలో పోటీ చేయాలని కొందరు ఆహ్వానించారు. ప్రజలకు మాట ఇచ్చే ముందే బాగా ఆలోచిస్తా. మాట ఇచ్చాక ఆరునూరైనా నెరవేర్చేంతవరకు శ్రమిస్తూనే ఉంటాను. జగన్ తనను ఒంటరి వాడిని చేశారని అంటున్నారు. అందరినీ పీడించిన నువ్వు ఒంటరివాడివెలా అవుతావు. వైసీపీకి 50 సీట్లు కూడా కష్టమని కొందరు బెట్టింగ్లు వేస్తున్నారు. మీరు సిద్ధమంటే నేనూ యుద్ధానికి సిద్ధమే" అని పవన్ స్పష్టం చేశారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి