Share News

Pawan Kalyan: అగ్ని-5 క్షిపణితో భారత్ రక్షణ ద్విగుణీకృతం

ABN , Publish Date - Mar 11 , 2024 | 10:33 PM

అగ్ని-5 క్షిపణితో భారత్ రక్షణ ద్విగుణీకృతమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తెలిపారు.డీఆర్డీఓ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. సోమవారం నాడు పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ... అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన ఈ క్షిపణి పని తీరు దేశం గర్వించదగిన ఆవిష్కరణగా చెప్పక తప్పదని అన్నారు.

Pawan Kalyan: అగ్ని-5 క్షిపణితో భారత్ రక్షణ ద్విగుణీకృతం

అమరావతి: అగ్ని-5 క్షిపణితో భారత్ రక్షణ ద్విగుణీకృతమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తెలిపారు.డీఆర్డీఓ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. సోమవారం నాడు పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ... అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన ఈ క్షిపణి పని తీరు దేశం గర్వించదగిన ఆవిష్కరణగా చెప్పక తప్పదని అన్నారు. ఐదు వేల కిలోమీటర్ల సుదూర లక్ష్యాలను సునాయాసంగా ఈ అస్త్రం ఛేదించడం మన దేశ రక్షణ వ్యవస్థకు అనితరమైన బలాన్ని అందిస్తుంటుందనడంలో సందేహం లేదని తెలిపారు. పది వార్ హెడ్లను మోసుకువెళ్లడమే కాకుండా బహుళ లక్ష్యాలను ఏక కాలంలో ఛేదించడం అద్భుతమేనని చెప్పారు.

ఇప్పటి వరకు అమెరికా, ఇంగ్లాండ్, రష్యా, ఫ్రాన్స్, చైనా మాత్రమే ఇలాంటి ఆయుధవ్యవస్థ కలిగి ఉందని చెప్పారు. ఇప్పుడు మన దేశం కూడా వీటి సరసన చేరడం మన శాస్త్రవేత్తల నైపుణ్యానికి నిదర్శనమని అన్నారు. అంతరిక్ష ప్రయోగాల్లో అనేక విజయాలను మన దేశం సొంతం చేసుకుంటున్నదని చెప్పారు. ఇప్పుడు క్షిపణి పరిజ్ఞానంలో మరో మెట్టు పైకి వెళ్లడం వెనక కేంద్రంలోని కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికత, అవిరళ కృషి దాగి ఉన్నాయని అన్నారు. ఈ విజయాన్ని దేశ ప్రజలకు అందించిన మన శాస్త్రవేత్తలకు పవన్ కళ్యాణ్ మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 12 , 2024 | 12:08 AM