Share News

Chandrababu: ఈనెల 9న వెంకటగిరికి చంద్రబాబు

ABN , Publish Date - Jan 04 , 2024 | 04:07 PM

Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈనెల 9న జిల్లాలోని వెంకటగిరిలో పర్యటించనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించనున్నారు.

Chandrababu: ఈనెల 9న వెంకటగిరికి చంద్రబాబు

ఉమ్మడి నెల్లూరు: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) ఈనెల 9న జిల్లాలోని వెంకటగిరిలో పర్యటించనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా వెంకటగిరి - ఏర్పేడు జాతీయ పక్కన హ్యాండ్లూం టెక్నాలజీ ఎదురుగా మైదానంలో మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో బహిరంగ సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏడు నియోజకవర్గాల జిల్లా స్థాయిలో జరుగుతున్న తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలి.. రా కార్యక్రమానికి లక్షకు పైగా జనాలు వస్తారని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల వెల్లడించారు. చంద్రబాబు బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల పిలుపునిచ్చారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 04 , 2024 | 04:07 PM