Share News

AP Elections 2024: జగన్‌కు లోకేశ్ సూపర్ పంచ్

ABN , Publish Date - Apr 22 , 2024 | 08:31 PM

వైసీపీ అధ్యక్షుడు, సీఎం వైయస్ జగన్‌పై రాయి దాడి అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తనదైన శైలిలో మరోసారి స్పందించారు. ఆ రాయి కోడికత్తి చరిత్రని తిరగ రాసింది. చీకట్లో లక్ష్యం తప్పకుండా ప్యాలస్ రాయి రెండు పిట్టల్ని కొట్టేసింది. లేని గాయానికి వేసిన కట్టు సైజు రోజు రోజుకీ పెరుగుతోంది. 'కట్టు'కథ, కంటి.. న్యూస్.. ఈ కట్టు కథలు మే 13న కంచికి చేరతాయని ఆయన వ్యంగ్యంగా పేర్కొన్నారు.

AP Elections 2024: జగన్‌కు లోకేశ్ సూపర్ పంచ్

అమరావతి, ఏప్రిల్ 22: వైసీపీ అధ్యక్షుడు, సీఎం వైయస్ జగన్‌పై రాయి దాడి అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తనదైన శైలిలో మరోసారి స్పందించారు. ఆ రాయి కోడికత్తి చరిత్రని తిరగ రాసింది. చీకట్లో లక్ష్యం తప్పకుండా ప్యాలస్ రాయి రెండు పిట్టల్ని కొట్టేసింది. లేని గాయానికి వేసిన కట్టు సైజు రోజు రోజుకీ పెరుగుతోంది. 'కట్టు'కథ, కంటి.. న్యూస్.. ఈ కట్టు కథలు మే 13న కంచికి చేరతాయని ఆయన వ్యంగ్యంగా పేర్కొన్నారు.

Khammam Lok Sabha Seat:: ఖర్గేతో తుమ్మల భేటీ

అటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లికి, ఇటు లోక్‌సభ ఎన్నికలు ఒకే సారి జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ఉదృతం చేశాయి. ఆ క్రమంలో సీఎం వైయస్ జగన్.. మేము సిద్దం పేరుతో బస్సు యాత్ర చేపట్టారు.

LokSabha Elections 2024: జయహో పాటకు.. శశిథరూర్ స్టెపులు

విజయవాడలోని అజిత్ సింగ్ నగర్‌లో బస్సు యాత్రలో భాగంగా వైయస్ జగన్ ప్రసంగిస్తుండగా.. ఆగంతకుడు రెండు రాళ్లు విసిరారు. అందులో ఓ రాయి సీఎం జగన్‌కు తగలగా, మరో రాయి ఆ పక్కనే ఉన్న మాజీ మంత్రి,ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావుకు తగిలింది. అయితే ఇక్కడ ఇద్దరికి కంటి భాగంలోనే తగలడం గమనార్హం.

AP Elections: పవన్ ప్రాణాలకు ముప్పు.. ఇవిగో సాక్ష్యాలు


దీంతో గత ఎన్నికల వేళ.. కోడి కత్తితో తనపై హత్యాయత్నం జరిగిందంటూ ప్రతిపక్ష నేతగా వైయస్ జగన్ ఆరోపణలు గుప్పించారు. అలా సానుభూతి ఓట్లతో ఆయన అధికారంలోకి వచ్చారు. ఇక వరుసగా రెండోసారి కూడా అధికారం అందుకొనేందుకు వైయస్ జగన్ సిద్దమయ్యారని.. అందులోభాగంగానే ఈ రాయి దాడి డ్రామా జరిగిందనే ఓ ప్రచారం అయితే తెలుగు రాష్ట్రాల్లో జోరందుకుంది.

LokSabha Elections: పెమ్మసాని ఆస్తులు.. ఆసక్తికర చర్చ

మరోవైపు లోక్‌సభ ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో జరుగుతున్నాయి. ఆ క్రమంలో మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలతోపాటు తెలుగు రాష్ట్రాల్లోని లోక్‌సభ స్థానాలకు సైతం పోలింగ్ జరగనుంది. ఈ పోలింగ్ వేళ ఓటర్లు..తమ ఓటు ద్వారా స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారని అందరు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైయస్ జగన్‌‌పై రాయి దాడి గురించి నారా లోకేశ్.. పైవిధంగా స్పందించారనే ఓ ప్రచారం సైతం పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతుంది.

Read Latest National News and Telugu News

Updated Date - Apr 22 , 2024 | 08:35 PM