Share News

Raghurama Krishnaraju: వైసీపీకి ఎంపీ రఘురామ రాజీనామా

ABN , Publish Date - Feb 24 , 2024 | 09:48 AM

ఇంతకాలం పాటు వైసీపీలోనే ఉంటూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కంటిలో నలుసులా మారిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు నేడు వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి కి పంపించారు. అయితే రఘురామ తన పదవికి సైతం రాజీనామా చేయబోతున్నారంటూ ప్రచారం జరిగింది.

Raghurama Krishnaraju: వైసీపీకి ఎంపీ రఘురామ రాజీనామా

ఢిల్లీ: ఇంతకాలం పాటు వైసీపీ (YCP)లోనే ఉంటూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి (CM Jagan)కి కంటిలో నలుసులా మారిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు (Raghurama Krishnaraju) నేడు వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డికి పంపించారు. అయితే రఘురామ తన పదవికి సైతం రాజీనామా చేయబోతున్నారంటూ ప్రచారం జరిగింది. ఆయన తన లోక్‌సభ సభ్యత్వాన్ని వదులుకునే లేదని.. పదవికి రాజీనామా చేయబోనని ఇప్పటికే చెప్పేశారు. ఈ క్రమంలోనే రఘురామ కేవలం పార్టీకి మాత్రమే రాజీనామా చేశారు.

పార్లమెంటరీ సభ్యత్వం నుంచి అనర్హులుగా చేయడానికి మొహమ్మద్ గజినీలా చేసిన ప్రయత్నాలు ఇప్పటి వరకూ మీరు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదని రాజీనామా లేఖలో రఘురామ పేర్కొన్నారు. ప్రయత్నించిన ప్రతిసారీ, మీ శత్రుత్వం, దురుద్దేశపూరిత క్రూరమైన చర్యలు ఉన్నప్పటికీ, గత 3.5 సంవత్సరాలుగా నర్సాపురంలో తన నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేశానన్నారు. ప్రజా శ్రేయస్సు కోసం సేవ చేయాలనే తన దృఢ నిశ్చయానికి గుర్తుగా.. వైసీపీ ప్రాథమిక క్రియాశీల సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నట్లు లేఖలో రఘురామ వెల్లడించారు. వెంటనే ఆమోదించాలని కూడా కోరారు. అందరం ప్రజల తీర్పును కోరాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి, అది మన ఇద్దరికీ ఉన్న అసంబద్ధమైన అనుబంధం నుంచి ఒక్కసారైనా విముక్తి చేస్తుందని రఘురామ కృష్ణరాజు లేఖలో వ్యాఖ్యానించారు. ఇక నెక్ట్స్ ఏ పార్టీ తరుఫున పోటీ చేస్తారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 24 , 2024 | 09:58 AM