Share News

AP News: మాజీ మంత్రి పుల్లారావు కుమారుడు శరత్‌ కేసులో ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం

ABN , Publish Date - Mar 14 , 2024 | 08:26 PM

మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌(Sarath) కేసులో ఏపీ హైకోర్టు, విజయవాడ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం నాడు శరత్‌ కేసును రెండు కోర్టులు విచారణ చేపట్టాయి. ఈ కేసులో కీలక పరిణామాలపై పిటీషనర్లు వాదనలు వినిపించారు. వాదనలు విన్న అనంతరం ఏపీ హైకోర్టు, విజయవాడ కోర్టు శరత్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

AP News: మాజీ మంత్రి పుల్లారావు కుమారుడు శరత్‌ కేసులో ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం

అమరావతి: మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌(Sarath) కేసులో ఏపీ హైకోర్టు, విజయవాడ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం నాడు శరత్‌ కేసును రెండు కోర్టులు విచారణ చేపట్టాయి. ఈ కేసులో కీలక పరిణామాలపై పిటీషనర్లు వాదనలు వినిపించారు. వాదనలు విన్న అనంతరం ఏపీ హైకోర్టు, విజయవాడ కోర్టు శరత్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

శరత్‌ను జీఎస్టీ కేసులో ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.శరత్‌ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరుతూ వేసిన పిటీషన్‌ను హైకోర్టు, విజయవాడ కోర్టులు కొట్టివేశాయి. అయితే ఈ లోపు శరత్ కేసును ప్రభుత్వం సీఐడీకి బదిలీ చేసింది. శరత్‌‌ను విచారించేందుకు సమయం కావాలని సీఐడీ కోరడంతో రెండు కోర్టులు తిరస్కరించాయి. రెండు వ్యక్తిగత ష్యూరిటీలు సమర్పించాలని శరత్‌కు కోర్టులు ఆదేశించింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 14 , 2024 | 08:26 PM