Share News

Nandyala: శ్రీశైలంలో కన్నులపండువగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

ABN , Publish Date - Jan 14 , 2024 | 08:25 AM

నంద్యాల: శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకుని సంక్రాంతి బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. మూడవ రోజు ఆదివారం ఉదయం స్వామి అమ్మవార్లకు విశేషపూజలు నిర్వహిస్తున్నారు.

Nandyala: శ్రీశైలంలో కన్నులపండువగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

నంద్యాల: శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకుని సంక్రాంతి బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. మూడవ రోజు ఆదివారం ఉదయం స్వామి అమ్మవార్లకు విశేషపూజలు నిర్వహిస్తున్నారు. శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామివారు రావణ వాహనంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. సాయంత్రం స్వామి అమ్మవార్లకు శ్రీశైలం పురవీధులలో గ్రామోత్సవం నిర్వహించనున్నారు.

బ్రహ్మోత్సవాలలో భాగంగా 15వ తేదీ (సోమవారం) మకరసంక్రాంతి పర్వదినం రోజున నందివాహనసేవ, స్వామి, అమ్మవార్లకు బ్రహ్మోత్సవ కల్యాణం, 16వ తేదీన కైలాసవాహనసేవ, 17 వతేదీన యాగపూర్ణాహుతి, కలశోద్వాసన, త్రిశూలస్నానం, సదస్యం, నాగవల్లి, ధ్వజావరోణ కార్యక్రమాలు, 18 వ తేదీన రాత్రి జరిగే పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవలతో ఉత్సవాలు ముగియనున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఈ నెల 12 నుంచి 18 వరకు ఆర్జిత, ప్రత్యక్ష, పరోక్షసేవలైన రుద్రహోమం, చండీహోమం, మృత్యుంజయహోమం, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణం, స్వామి, అమ్మవార్ల కల్యాణం, ఏకాంతసేవలను నిలుపుదల చేశారు.

Updated Date - Jan 14 , 2024 | 08:25 AM