Share News

Road Accident: డోన్ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం..

ABN , Publish Date - May 25 , 2024 | 08:02 AM

నంద్యాల జిల్లా (Nandyala) డోన్ డోన్ జాతీయ రహదారిపై ఉంగరానిగుండ్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొన్నది. ఈ ప్రమాదంలో..

Road Accident: డోన్ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం..

నంద్యాల, ఆంధ్రజ్యోతి మే-25: నంద్యాల జిల్లా (Nandyala) డోన్ డోన్ జాతీయ రహదారిపై ఉంగరానిగుండ్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానిక సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరణించిన ముగ్గురిని ముని,ప్రభాకర్, దశరథగా పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు.


కాగా.. ముని, ప్రభాకర్‌లు తుగ్గలి మండలం లింగనేని దొడ్డి వాసులుగా, దశరథ డోన్ మండలం చనుగొండ్ల వాసిగా పోలీసులు గుర్తించి.. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే.. బైక్‌ను లారీ ఢీకొనడం వల్లే ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి చుట్టు పక్కలా సీసీ కెమెరాలు, సమీపంలోని టోల్‌గేట్ వద్ద పోలీసులు ఫుటేజీ సేకరించే పనిలో ఉన్నారు.

Updated Date - May 25 , 2024 | 08:08 AM