Share News

ACB Court: ఈఎస్ఐ కేసులో చార్జిషీటును పరిగణలోకి తీసుకునేందుకు నిరాకరించిన కోర్టు..

ABN , Publish Date - Feb 01 , 2024 | 01:13 PM

అమరావతి: ఏపీ తెలుగుదేశం అధ్యక్షుడు, అచ్చెన్నాయుడుపై ఈఎస్ఐ కేసులో చార్జిషీటును పరిగణలోకి తీసుకునేందుకు న్యాయస్థానం నిరాకరించింది. గురువారం విజయవాడ ఏసీబీ కోర్టులో చార్జిషీట్ వేసేందుకు ఏసీబీ అధికారులు వచ్చారు.

ACB Court: ఈఎస్ఐ కేసులో చార్జిషీటును పరిగణలోకి తీసుకునేందుకు నిరాకరించిన కోర్టు..

అమరావతి: ఏపీ తెలుగుదేశం అధ్యక్షుడు, అచ్చెన్నాయుడుపై ఈఎస్ఐ కేసులో చార్జిషీటును పరిగణలోకి తీసుకునేందుకు న్యాయస్థానం నిరాకరించింది. గురువారం విజయవాడ ఏసీబీ కోర్టులో చార్జిషీట్ వేసేందుకు ఏసీబీ అధికారులు వచ్చారు. అయితే అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం చార్జిషీట్ వేసేందుకు గవర్నర్ అనుమతి తప్పనిసరి అని, అప్పాయింటింగ్ అథారిటీ అనుమతి లేకుండా చార్జిషీట్ పరిగణలోకి తీసుకోమని న్యాయమూర్తి స్పష్టం చేశారు. కాగా చార్జిషీటును పరిగణలోకి తీసుకోవచ్చని ఏసీబీ తరపు న్యాయవాదులు చెప్పారు. చార్జిషీట్‌ను అనుమతి లేకుండా పరిగణలోకి తీసుకోవచ్చని ఏమైనా తీర్పులు ఉన్నాయా? అని న్యాయస్థానం ప్రశ్నించింది. ఉన్నత న్యాయస్థానాలు ఇచ్చిన అటువంటి తీర్పులు ఏమైనా ఉంటే ఇవ్వాలని న్యాయమూర్తి కోరారు. అటువంటి తీర్పులు లేకుండా చార్జిషీట్‌ను పరిగణలోకి తీసుకునేది లేదని మరోసారి న్యాయమూర్తి చెబుతూ తదుపరి కేసు విచారణ ఫిబ్రవరి 6 వ తేదీకి వాయిదా వేశారు.

Updated Date - Feb 01 , 2024 | 01:13 PM