Share News

Tulasi Reddy: జగన్ పాలనలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి: తులసి రెడ్డి

ABN , Publish Date - Mar 08 , 2024 | 01:55 PM

విజయవాడ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కాంగ్రెస్ మీడియా ఛైర్మెన్ తులసిరెడ్డి శుభాకాంక్షలు చెప్పారు.

Tulasi Reddy: జగన్ పాలనలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి: తులసి రెడ్డి

విజయవాడ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Women Day) సందర్భంగా మహిళలందరికీ కాంగ్రెస్ మీడియా ఛైర్మెన్ (Congress Media Chairman) తులసిరెడ్డి (Tulasi Reddy) శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్బంగా శుక్రవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ మొదటి నుంచి మహిళలకు పెద్దపీట వేస్తోందని.. 1975 లోనే డాక్రా పథకాన్ని ప్రవేశపెట్టి మహిళలను మహారాణులుగా చేసిందన్నారు. స్థానిక ప్రభుత్వాలలో 33 శాతం రిజర్వేషన్లు కల్పించిందని, బంగారు తల్లి, అమ్మ హస్తం పథకాలను అమలు చేసిందన్నారు. జగన్ (CM Jagan) పాలనలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని, రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, మహిళలు తమ తాళిబొట్టు తాకట్టు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ అభయం పథకం క్రింద ప్రతి నిరుపేద కుటుంబంలో మహిళ ఖాతాలోకి నెలకు రూ. 5 వేలు వేయడం జరుగుతుందని.. రూ. 500 కే వంటగ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తుందని.. అంగన్‌వాడీ, ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని తులసిరెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - Mar 08 , 2024 | 01:55 PM